ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

government effert రైతుబజార్ల వైపు.. కూటమి చూపు

ABN, Publish Date - Jan 05 , 2025 | 12:50 AM

రైతుబజార్ల ఏర్పాటు, విస్తరణ, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గడచిన ఐదేళ్లలో రైతుబజార్ల ఏర్పాటు, పాత బజార్లలో నెలకొన్న సమస్యలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కన్నెత్తి చూడకపోవడంతో దయనీయంగా మారాయి.

రైతుబజార్ల వైపు.. కూటమి చూపు

కొత్తగా ఆరుచోట్ల ఏర్పాటుకు సన్నాహాలు

ఉమ్మడి జిల్లాల్లో ఎనిమిది బజార్ల విస్తరణ

మార్కెటింగ్‌ శాఖ ప్రతిపాదనలు

రాజాం రూరల్‌, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రైతుబజార్ల ఏర్పాటు, విస్తరణ, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. గడచిన ఐదేళ్లలో రైతుబజార్ల ఏర్పాటు, పాత బజార్లలో నెలకొన్న సమస్యలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కన్నెత్తి చూడకపోవడంతో దయనీయంగా మారాయి. నిర్వహణ సరిగా లేక అభివృద్ధి కానరాక కళ తప్పాయి. వాటి దుస్థితిని పరిశీలించిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయాలని, విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జిల్లాలో కొత్తగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరుచోట్ల రైతుబజార్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో ఎనిమిది రైతుబజార్లను విస్తరించి, అభివృద్ధి చేయాలని మార్కెటింగ్‌శాఖ రంగం సిద్ధం చేస్తోంది.

జిల్లా కేంద్రంలో మూడు, రాజాం, ఎస్‌.కోట, కొటారుబిల్లి, చీపురుపల్లి, మన్యం జిల్లాకేంద్రం పార్వతీపురంలో ఒక రైతు బజారు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అలాగే విజయనగరం రాజులకు చెందిన ప్రయివేటు స్థలంలో మరో రైతుబజార్‌ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఇక్కడ శాశ్వత భవనం నిర్మించాలన్న ప్రతిపాదనకు గత ప్రభుత్వం మంగళం పాడింది. చీపురుపల్లిలో ప్రారంభించిన రైతుబజార్‌ నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పూర్తిచేయాలన్న కృతనిశ్ఛయంలో ఈ ప్రభుత్వం ఉంది. కొత్తగా గరివిడి, భోగాపురం, బొబ్బిలి, గజపతినగరం, కొత్తవలస, పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టంలో రైతుబజార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి సంబంధించి ప్రతిపాదనలున్నాయి. స్థలసేకరణకు రెవెన్యూ రంగం సిద్ధం చేస్తోంది. రాజాంలో గత తెలుగుదేశం ప్రభుత్వం సుమారు రూ.కోటితో ఏర్పాటుచేసిన రైతుబజార్‌ పరిస్థితి అధ్వానంగా మారింది. రైతుబజార్‌లోకి రాకపోకలు సాగించేందుకు రహదారి లేదు. లోపల పరిస్థితి దుర్గంధభరితంగా మారింది. ఇలాంటి రైతు బజార్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గరివిడిలో రైతుబజార్‌ నిర్మాణం కోసం రూ.45 లక్షలు, భోగాపురంలో నిర్మాణం కోసం రూ.75 లక్షల నిధులు మంజూరైనా గత ప్రభుత్వ హయాంలో బిల్లుల జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. ఈరెండుచోట్లా నిర్మాణం పనులు ప్రారంభించే దిశగా మార్కెటింగ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రైతుబజార్‌ నిర్మాణానికి కేటాయించిన రూ.75 లక్షలు ఏమూలకు సరిపడవని, రూ.కోటి అంతకుమించి నిధులు అవసరమని భావిస్తున్న అధికారులు ఆ మేరకు నిధులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎస్‌.కోట మండలం కొటారుబిల్లిలో మినీ, పార్వతీపురంలో రైతుబజార్ల ఆధునికీకరణకు సైతం అడుగులు పడనున్నాయి.

--------------

Updated Date - Jan 05 , 2025 | 12:50 AM