ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Natural Farming ప్రకృతి వ్యవసాయ జిల్లాగా తీర్చిదిద్దాలి

ABN, Publish Date - Apr 02 , 2025 | 11:28 PM

Transforming into a Natural Farming District ప్రకృతి వ్యవసాయ జిల్లాగా పార్వతీపురం మన్యాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. సేంద్రియ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. నిమ్మగడ్డి సాగుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయ జిల్లాగా పార్వతీపురం మన్యాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. సేంద్రియ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. నిమ్మగడ్డి సాగుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జీడి, పసుపు, ఇతర పంటలపై వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు దృష్టిసారించాలన్నారు. సెరీకల్చర్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫాంపాండ్స్‌ ఏర్పాటుతో రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు తొమ్మిది వేల ఫాంపాండ్స్‌ పనులు ప్రారంభించగా.. వాటిల్లో కొన్ని పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది 50 వేల ఫాంపాండ్స్‌ లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. జిల్లాలో 4,800 ఎకరాల్లో పైనాపిల్‌ సాగుకు అవకాశం ఉందన్నారు. అయితే ప్రస్తుతం 250 ఎకరాల్లోనే పంట సాగవుతుందని చెప్పారు. ఈ ఏడాది కనీసం వేయి ఎకరాల్లో సాగు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్థక శాఖాధికారులు రాబర్ట్‌పాల్‌, శ్యామల, సంతోష్‌కుమార్‌, సాల్మన్‌రాజు, మన్మఽథరావు తదితరులు పాల్గొన్నారు.

6,205 రెవెన్యూ సమస్యలు

జిల్లాలో 6,205 రెవెన్యూ సదస్సులను నిర్వహించామని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. అడిషనల్‌ సీసీఎల్‌ఏ, సెక్రటరీ ఎన్‌. ప్రభాకర రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందరంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లాలో ఇంకా 41 రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉందన్నారు. పీజీఆర్‌ఎస్‌లో ఇప్పటివరకు 29,778 అర్జీలు రాగా, వాటిల్లో 29,365 వరకు పరిష్కరించామన్నారు. జేసీ శోభిక, డీఆర్వో హేమలత పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:28 PM