charge డీసీసీబీ సీఈఓగా ఉమామహేశ్వరరావు
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:21 PM
Umamaheswara Rao as the CEO of DCCB
డీసీసీబీ సీఈఓగా ఉమామహేశ్వరరావు
విజయనగరం రూరల్, జనవరి 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) సీఈఓగా సీహెచ్ ఉమామహేశ్వరరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన కిమిడి జనార్థన్ ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత మూడు నెలలుగా ఇన్‌చార్జి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయనను రెగ్యులర్ సీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను జిల్లా జాయింట్ కలెక్టరు సేతుమాధవన్ అందించారు. ఈ సందర్భంగా గురువారం తన చాంబర్లో ఉమామహేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుతూ డీసీసీబీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.
Updated Date - Jan 02 , 2025 | 11:21 PM