Thotapalli Reservoir తోటపల్లిలో నీటి నిల్వలు తగ్గుముఖం
ABN, Publish Date - Mar 23 , 2025 | 11:38 PM
Water Levels Declining in Thotapalli Reservoir తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ప్రాజెక్టు సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.109 టీఎంసీలకు చేరుకుంది ( 105 మీటర్లకు గాను 102.35 మీటర్ల స్థాయికి చేరింది) . పైప్రాంతం నుంచి 150 క్యూసెక్కుల నీరు చేరగా, నదీ మార్గం గుండా 50 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ నుంచి 150 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు.

గరుగుబిల్లి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ప్రాజెక్టు సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.109 టీఎంసీలకు చేరుకుంది ( 105 మీటర్లకు గాను 102.35 మీటర్ల స్థాయికి చేరింది) . పైప్రాంతం నుంచి 150 క్యూసెక్కుల నీరు చేరగా, నదీ మార్గం గుండా 50 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ నుంచి 150 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వచ్చేది 150 క్యూసెక్కులైతే విడుదల చేస్తుంది మాత్రం 300 క్యూసెక్కులు. వీరఘట్టం, పాలకొండతో పాటు శివారు ప్రాంతాల వారికి తాగునీటి సౌకర్యార్థం గత కొద్ది రోజులుగా నదీ మార్గం గుండా నీటిని విడుదల చేస్తున్నారు. నవిరి ప్రాంతంలో పాత రహదారి కూడా బటయకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో స్పిల్‌వేకు ఆనుకున్న ప్రాంతంతో పాటు దిగువకు వెళ్లే నదీ మార్గంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఖరీఫ్‌లో రైతులకు కష్టాలు తప్పేలా లేవు.
Updated Date - Mar 23 , 2025 | 11:38 PM