కుంకి ఏనుగులను ఇక్కడే మచ్చిక చేస్తాం
ABN, Publish Date - Mar 21 , 2025 | 12:24 AM
కుంకి ఏనుగులను ఇక్కడే మచ్చిక చేస్తామని పార్వతీపురం రేంజ్ అటవీశాఖ అధికారి రామనరేష్ అన్నారు.

సీతానగరం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కుంకి ఏనుగులను ఇక్కడే మచ్చిక చేస్తామని పార్వతీపురం రేంజ్ అటవీశాఖ అధికారి రామనరేష్ అన్నారు. అప్పయ్యపేట గ్రామంలో అప్పయ్యపేట, గుచ్చిమి, తాన్న సీతారాంపురం, చిన్నారాయుడుపేట, రేపటివలస, తామరఖండి గ్రామాల ప్రజలతో అటవీశాఖ అధికారులు గురువారం సమావేశం అయ్యారు. రామనరేష్ మాట్లాడుతూ చుట్టుపక్కల భూములు సాగు చేసుకుంటున్న పేదలకు ఆటంకం కలిగించబోమని, యథావిధిగా సాగు కొనసాగించవచ్చన్నారు. కానీ కుంకీ ఏనుగులను తీసుకొచ్చి మచ్చిక చేసే ఏర్పాట్లు మాత్రం ఇక్కడే కొనసాగుతాయని స్పష్టం చేశారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజలు అంగీకరించలేదు. ఫారెస్ట్ అధికారి మనోజ్‌కుమార్, సీపీఎం సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి, రెడ్డి వేణు, రైతుకూలీ సంఘం నాయకులు పి.శ్రీనునాయుడు, సీపీఐ నాయకులు కోరంగి మన్మధరావు, భాస్కరరావు, కుమార్, స్థానిక ఎంపీటీసీ సభ్యులు బురిడి సూర్యనారాయణ, సీతానగరం మండల సీపీఎం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, గవర వెంకటరమణ పాల్గొన్నారు.
Updated Date - Mar 21 , 2025 | 12:24 AM