సంక్షేమం.. అభివృద్ధికి ప్రాధాన్యం
ABN, Publish Date - Jan 13 , 2025 | 12:06 AM
Welfare is priority for development రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రగతి దిశగా పరిపాలిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వచ్చాక ఏడు నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువెళ్తున్నారన్నారు.
సంక్షేమం.. అభివృద్ధికి ప్రాధాన్యం
రాష్ట్రంలో ప్రగతి దిశగా పాలన
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం రూరల్/ విజయనగరం రింగురోడ్డు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రగతి దిశగా పరిపాలిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం వచ్చాక ఏడు నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువెళ్తున్నారన్నారు. బయోటెక్నాలజీ, ఈవీ క్లస్టర్‌ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. సంక్రాంతి శుభవేళ చాలా రోజుల నుంచి పెండింగ్‌లో వున్న పలు సమస్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారం చూపారన్నారు. గత ఐదేళ్ళలో పెండింగ్‌లో వున్న సుమారు రూ.6,750 కోట్ల బకాయిలను విడుదల చేసి వివిధ వర్గాల్లో వెలుగులు నింపారన్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలను విడుదల చేసినట్లు చెప్పారు. బకాయిల్లో ఉపాధ్యాయ, ఉద్యోగుల జీపీఎఫ్ కింద రూ.519 కోట్లు, పోలీసుల సరెండర్ లీవుల కోసం రూ.788 కోట్లు విడుదల చేసి సుమారు 54,900 మందికి ప్రయోజనం చేకూర్చామన్నారు. జిల్లాలో 2 లక్షల 70 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు రెండు రోజుల్లోనే డబ్బులు జమ చేయడం వల్ల రైతులు ఎంతో సంతోషంగా వున్నారన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనపై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎందరో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబర్చుతున్నారన్నారు. తాటిపూడిలో బోటు షీకారును ఏర్పాటు చేశామని, రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమౌతాయన్నారు. సమావేశంలో క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంధి అర్జున మహేశ్వరరావు, టీడీపీ నాయకులు కడగల అనందకుమార్, చొప్పా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి
విజయనగరం ఆర్టీసీ బస్సు డిపోలో ఆదివారం నాలుగు నూతన ఎక్స్‌ప్రెస్ బస్సులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ దున్నుదొరతో కలిసి ప్రారంభించారు. విజయనగరం, ఎస్.కోట, పార్వతీపురం డిపోలకు సంబంధించిన ఈ నాలుగు బస్సులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్టీసీ విజయనగరం జోన్-1 ఈడీ ఎ.విజయ్‌కుమార్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రజారవాణాధికారులు సీహెచ్ అప్పలనారాయణ, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 12:06 AM