Doctors వైద్యులు ఎప్పుడొస్తారో?
ABN, Publish Date - Jan 12 , 2025 | 12:05 AM
When Will the Doctors Arrive? జిల్లాలో ఆయుర్వేదిక్, హోమియో డిస్పెన్సరీలకు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత వైసీపీ సర్కారు పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కొంతకాలంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పలుచోట్ల మూతడిన వైనం
ఇబ్బంది పడుతున్న రోగులు
కూటమి ప్రభుత్వం స్పందించాలని విన్నపం
జియ్యమ్మవలస, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయుర్వేదిక్, హోమియో డిస్పెన్సరీలకు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గత వైసీపీ సర్కారు పోస్టుల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కొంతకాలంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యాధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఆయుర్వేదిక్, హోమియో డిస్పెన్సరీల పరిస్థితి దారుణంగా మారింది. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో 12 ఆయుర్వేదిక్, ఏడు హోమియో డిస్పెన్సరీలు ఉన్నాయి. జియ్యమ్మవలస, రస్తాకుంటుబాయి, బూర్జ, మక్కువ, దుగ్గేరు, సాలూరు, సీతంపేట, కవిరిపల్లి, సీతానగరంలో ఉన్నవి రెగ్యులర్ ఆయుర్వేదిక డిస్పెన్సరీలు. డోకిశీల, రావివలస, అన్నవరంలో కాంట్రాక్టు బేసిక్ డిస్పెన్సరీలు ఉన్నాయి. అయితే దుగ్గేరు డిస్పెన్సరీకి పూర్తిగా తాళం వేసేశారు. మిగిలిన 11 డిస్పెన్సరీల్లో బూర్జ, కవిరిపల్లి, అన్నవరం డిస్పెన్సరీల్లో మాత్రమే వైద్యాధికారులు ఉన్నారు. మిగిలిన చోట్ల అసలు వైద్యులే లేరు. దీంతో దీంతో కాంపౌండర్లే డాక్టర్లుగా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది.
- హోమియో డిస్పెన్సరీల విషయానికొస్తే.. జిల్లాలో పార్వతీపురం, గరుగుబిల్లి, తలవరం, బాసూరులలో రెగ్యులర్ డిస్పెన్సరీలు ఉన్నాయి. ఇందులో గరుగుబిల్లి, తలవరం, బాసూరులో డిస్పెన్సరీలు మూతపడ్డాయి. ప్రస్తుతానికి పార్వతీపురంలో మాత్రమే రెగ్యులర్ డిస్పెన్సరీ నడుస్తోంది. కాంట్రాక్టు డిస్పెన్సరీల్లో గళావళి మినహా మర్రిపాడు, కుసిమిలోనే వైద్యులున్నారు. విజయనగరం జిల్లాలో కూడా 16 ఆయుర్వేదిక్, 16 హోమియో, రెండు యునాని డిస్పెన్సరీలు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా చోట్ల వైద్యాధికారులు లేరు. దీంతో ఉమ్మడి జిల్లావాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పది రోజుల్లో భర్తీ చేస్తాం
హోమియో, ఆయుర్వేదిక్, యునాని డిస్పెన్సరీల్లో వైద్యాధికారుల పోస్టులు భర్తీ చేస్తాం. ఇప్పటికే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చాం. మరో పది రోజుల్లో పూర్తిస్థాయిలో వైద్యులు వచ్చి జాయిన్ అవుతారు.
- ఝాన్సీలక్ష్మి, రీజనల్ డైరెక్టర్, విశాఖపట్నం
Updated Date - Jan 12 , 2025 | 12:05 AM