which is fact ఏదీనిజం?
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:40 PM
what is correct మెంటాడ మండలం కూనేరు పంచాయతీ మిర్తివలస గ్రామానికి చెందిన పాడి గౌరమ్మ ఆస్పత్రుల్లో కాకుండా 108లో ప్రసవించిన ఉదంతంపై జిల్లా వైద్య వర్గాల్లో నేటికీ చర్చ నడుస్తోంది. ఎందుకలా జరిగింది? పీహెచ్‌సీ సిబ్బంది ఏం చెప్పారు? ఏరియా ఆస్పత్రి సిబ్బంది ఎలా స్పందించారు? నిర్లక్ష్యం చేసిందెవరు? తదితర అంశాలపై విడివిడిగా విచారిస్తున్న ఇద్దరు జిల్లా స్థాయి మహిళా అధికారులు వేర్వేరు ప్రకటనలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కేసు తీవ్రతను తగ్గించేందుకు తెరవెనుక ప్రయత్నాలేవో జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏదీనిజం?
గర్భిణి ఉదంతంలో ఆసక్తికర మలుపు
ఏరియా ఆస్పత్రికి డీసీహెచ్‌ఎస్ క్లీన్‌చిట్
తప్పును చల్లపేట పీహెచ్‌సీపై నెట్టివేత
చల్లపేట పీహెచ్‌సీది తప్పులేదన్న డీఎంహెచ్‌వో
ఏరియా ఆస్పత్రి వద్ద సమస్య వచ్చిందని సుస్పష్టం
ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమని 108 సిబ్బంది వెల్లడి
చర్చనీయాంశంగా డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌వో భిన్న ప్రకటనలు
మెంటాడ మండలం కూనేరు పంచాయతీ మిర్తివలస గ్రామానికి చెందిన పాడి గౌరమ్మ ఆస్పత్రుల్లో కాకుండా 108లో ప్రసవించిన ఉదంతంపై జిల్లా వైద్య వర్గాల్లో నేటికీ చర్చ నడుస్తోంది. ఎందుకలా జరిగింది? పీహెచ్‌సీ సిబ్బంది ఏం చెప్పారు? ఏరియా ఆస్పత్రి సిబ్బంది ఎలా స్పందించారు? నిర్లక్ష్యం చేసిందెవరు? తదితర అంశాలపై విడివిడిగా విచారిస్తున్న ఇద్దరు జిల్లా స్థాయి మహిళా అధికారులు వేర్వేరు ప్రకటనలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. కేసు తీవ్రతను తగ్గించేందుకు తెరవెనుక ప్రయత్నాలేవో జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మెంటాడ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి):
కూనేరు పంచాయతీ మిర్తివలస గ్రామానికి చెందిన పాడి గౌరమ్మకు ఈనెల 15న డెలివరీ డేట్ ఇచ్చారని, ఈనెల 4న స్వల్పంగా నొప్పులు రావడం తో కుటుంబ సభ్యులు చల్లపేట పీహెచ్‌సీకి తీసుకు వెళ్లగా సాధారణ నొప్పులేనని, డెలివరీకి ఇంకా పది రోజులు సమయం ఉన్నందున జాగ్రత్తగా ఉండాల న్నారని వైద్యులు చెప్పినట్లు ఆమె స్వయంగా తెలిపారు. అత్యవసరమైతే తాము అందుబాటులోనే ఉంటామని వైద్యాధికారి, సిబ్బంది ధైర్యం చెప్పి ఐరన్ ఇంజక్షన్ ఇచ్చి పంపారని గౌరమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఈ ఆరు రోజుల వ్యవధిలో పలుమార్లు ‘ఆంధ్రజ్యోతి’కి స్పష్టం చేశారు. మొత్తం పది ఐరన్ ఇంజక్షన్లకు గాను అంతకముందు ఐదు ఇంజక్షన్లు చేశారని పేర్కొన్నారు. కాగా 4న చల్లపేట పీహెచ్‌సీ నుంచి ఇంటికివెళ్లాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో నొప్పులు తీవ్రమవడంతో 108 వాహనంలో 5 గంటల ప్రాంతంలో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. సాయంత్రం 4 గంటలు దాటాక ఇక్కడ వైద్యులు ఉండరని తెలిసీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని 108 సిబ్బందిపై అసహనం ప్రదర్శించి కనీసం తనిఖీ కూడా చేయకుండా తనను ఘోషాకు రిఫర్ చేశారని, గాజులరేగ సమీపంలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బందే చొరవ తీసుకొని తనకు ప్రసవం చేశారన్నది బాధితురాలి మాట. అదే విషయాన్ని 108 సిబ్బంది గౌరినాయుడు, శివ కూడా ‘ఆంధ్ర జ్యోతి’కి వివరించారు. ఘటనపై మరుసటిరోజు 5న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తకు స్పందించిన డీఎంహెచ్‌వో జీవనరాణి అదేరోజున ఏరియా ఆస్పత్రిని విజిట్ చేసి ముందు రోజు సాయంత్రం ఏం జరిగిందినేది ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందిని విచారించారు. గైనకాల జిస్టులు అందుబాటులో లేని విషయాన్ని గుర్తించారు. నిర్లక్ష్యం జరిగినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వైద్యులు, సిబ్బంది తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు. మార్గమధ్యలో బాధితురాలు గౌరమ్మకు ఏమైనా జరి గుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారని కూడా ప్రశ్నిం చారు. దీనిపై విచా రించి నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీష్‌ను ఆదేశించారు.
ఎన్నెన్నో ప్రశ్నలు.. సందేహాలు
విచారణ జరుగుతున్న సమయంలో ఇదే ఘటనపై స్పందించిన డీసీహెచ్‌ఎస్ రాజ్యలక్ష్మి శనివారం ఏరియా ఆస్పత్రిని సందర్శించి ఘటనపై ఆరా తీశారు. సిబ్బంది తో మాట్లాడాక ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తప్పులేనేలేదని తేల్చేశారు. తప్పంతా చల్లపేట పీహెచ్ సీ వైద్యులు, సిబ్బందిదేనని కూడా మీడియాకు ప్రకటిం చేశారు. ఈనెల 4న చల్లపేట పీహెచ్‌సీకి గర్భిణీ వైద్య పరీక్షలకు వెళితే నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఇంటికి పంపేశారని చెబుతూనే చల్లపేట వైద్యులు ఘోషాస్పత్రికి రిఫర్ చేశారని, అలాంటప్పుడు ఏరియా ఆస్పత్రికి తీసుకురావడమేంటని అంటూ వారు (108) కూడా బాధ్యులే అన్నట్టుగా వ్యాఖ్యానించా రు. గర్భిణి ఏరియా ఆస్పత్రికి వచ్చినప్పుడు వైద్యులు, సిబ్బంది, సూపరింటెండెంట్ అస్పత్రిలో ఉన్నారని చెప్పు కొచ్చారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటే నాలుగు దాటాక వైద్యులు అందుబాటులో వుండరని తెలియదా అంటూ 108 సిబ్బందితో ఆమె వాగ్వాదానికి ఎందుకు దిగినట్టు...? అంతమంది అందుబాటులో వుంటే గర్భిణి కి ఎందుకు తోడ్పాటు అందించలేదు? తల్లీబిడ్డ ప్రస్తు తం క్షేమంగా వున్నారు కానీ వారికి ఏమైనా జరిగి ఉంటే ఆ లోటును ఎవరు పూడుస్తారు? అన్న ప్రశ్నల కు వైద్యులే సమాధానం చెప్పాలి. బాధితురాలు గౌరమ్మ, చల్లపేట పీహెచ్‌సీ వైద్యులు, 108 సిబ్బంది, డీఎంహెచ్‌వో వెర్షన్ ఒకలాఉండగా, డీసీహెచ్‌ఎస్ రాజ్యలక్ష్మీ వివరణ ఇందుకు పూర్తి భిన్నంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎవరిది నిజం? ఏది అసత్యం? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పొరపాటు లేకపోతే సంఘ టన జరిగిన రోజు సీసీఫుటేజీలను డీసీహెచ్‌ఎస్ ఎందు కు సేకరించారు? సిబ్బంది నుంచి పలుమార్లు వివరణ ఎందుకు కోరారు? ఇంటి గుట్టు బయటపెడితే ఎలా అని 108 సిబ్బందిని వారించడం వెనుక ఆంతర్యం ఏమిటి? మీడియాకు సమాచారం అందిస్తే ఇక ఉపే క్షించేదిలేదని ఓ వైద్యుడు సిబ్బందికి ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? వీటికి సమాధానం చెప్పాలని రోగులు కోరుతున్నారు.
- ఈ ఘటన కలెక్టర్ అంబేడ్క ర్ దృష్టికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్న క్రమంలో బాధ్యుల్ని కాపాడేందు కు ప్రయత్నాలు జరుగుతున్నా యన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు నిజానిజాల నిగ్గుతేల్చాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ము న్ముందు ఈ ఎపిసోడ్ మరెన్ని మలుపులు తిరుగుతుం దో చూడాలి.
Updated Date - Feb 09 , 2025 | 11:41 PM