ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

affried కనిపెట్టేస్తారేమో!

ABN, Publish Date - Jan 06 , 2025 | 12:13 AM

Will find out! వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి అడుగడుగునా అవతవకలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అర్హులు కంటే అనర్హులే ఎక్కువగా ఉన్నారు. ఇటువంటి వారి లెక్క తేల్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతి దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారుడి వైకల్యంతో పాటు వివరాలను సేకరించి అర్హులెవరో.. అనర్హులెవరో తేల్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నుంచే సర్వే ప్రారంభం కానుంది.

- రాజాం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 2019 ఎన్నికలకు ముందు 12 మంది దివ్యాంగులకు పింఛన్లు ఉండేవి. పక్కాగా వైకల్యం ఉన్నవారికే పింఛన్లు అందుతూ వచ్చాయి. అదే గ్రామంలో దివ్యాంగ పింఛన్లు 35కు చేరాయి. వైద్యులు ఇచ్చిన సదరం ధ్రువీకరణ పత్రంతోనే అది సాధ్యమైంది. కొందరు వ్యక్తులు తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్లు పొందుతున్నట్టు ఆ గ్రామస్థులు చెబుతున్నారు.

- కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. అప్పట్లో వారే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేవారు. దీంతో లబ్ధిదారుల వివరాలు పెద్దగా తెలిసేవి కావు. బయటకు వ్యక్తం చేసేవారు కాదు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్‌ ఇస్తున్నారు. అన్ని అవయవాలూ సరిగా ఉన్న కొందరిని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు.

- రాజాం నియోజకవర్గంలో సదరం ధ్రువపత్రాల జారీ విషయంలో కొందరు లక్షాధికారులయ్యారు. ఆ ధ్రువపత్రం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ పలికింది. కొన్ని గ్రామాల్లో దళారులు అవతారం ఎత్తి గత ప్రభుత్వంలో ధ్రువీకరణ పత్రం జారీలో చక్రం తిప్పారు. నీకింత నాకింత అంటూ డాక్టర్‌కి కొంత మొత్తం ఇచ్చి మిగతాది తమ జేబులో వేసుకున్నారు.

కనిపెట్టేస్తారేమో!

బోగస్‌ పింఛన్‌దారుల్లో టెన్షన్‌

నేటి నుంచి దివ్యాంగ పింఛన్ల తనిఖీ

ముందుగా మంచంపై ఉన్నవారి పరిశీలన

ఇంటింటికీ వెళ్లనున్న వైద్య బృందం

తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్‌ పొందుతున్న వారిలో ఆందోళన

రాజాం, జనవరి 5(ఆంధ్రజ్యోతి):

వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి అడుగడుగునా అవతవకలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అర్హులు కంటే అనర్హులే ఎక్కువగా ఉన్నారు. ఇటువంటి వారి లెక్క తేల్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రతి దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారుడి వైకల్యంతో పాటు వివరాలను సేకరించి అర్హులెవరో.. అనర్హులెవరో తేల్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం నుంచే సర్వే ప్రారంభం కానుంది. శనివారం మార్గదర్శకాలు కూడా జారీచేసింది. కాగా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ మొత్తాన్ని పెంచిన సంగతి తెలిసిందే. దివ్యాంగులకు రూ.6వేలు, కండరాల బలహీనత, పక్షవాతం తదితర రుగ్మతలతో బాధపడుతున్నవారికి రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులకు గురై మంచం పట్టిన వారికి రూ.15 వేలకు పెంచింది. జిల్లాలో మంచానికే పరిమితమైనవారు 342 మంది ఉన్నారు. వీరి ఇంటికి వెళ్లి వైద్య బృందం తనిఖీలు చేయనుంది. ఇందుకుగాను ఇతర జిల్లాలకు చెందిన వైద్యుల బృందాన్ని నియమించింది. ఇందులో ఒక ఆర్థోపెడిక్‌ వైద్యుడు, జనరల్‌ ఫిజీషియన్‌ ఉంటారు. వీరికి స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి, గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ సహకారం అందిస్తారు. ఈ బృందం రోజుకు 15 నుంచి 20 మందిని పరీక్షిస్తారు. సమగ్ర వివరాలు యాప్‌లో నమోదుచేస్తారు. నెల రోజుల్లో తొలి దశ ప్రక్రియ పూర్తికావాలని ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లాలో రూ.6 వేల పింఛన్‌ అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య 36,974. ఇందులోనే ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు డ్రైవింగ్‌ చేస్తున్న వారు సైతం దివ్యాంగ పింఛన్లు దక్కించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటువంటి వారి విషయంలో పక్కాగా తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వైద్య బృందాల ఎంపిక కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగింది. మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు పూర్తిచేయాలని ఆదేశించింది. దివ్యాంగులను దగ్గర్లో ఉన్న పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, మెడికల్‌ కాలేజీలు, జిల్లా కేంద్రాస్పత్రులకు తీసుకెళ్లి పరీక్షిస్తారు. ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట సమయం ఇస్తారు. ఆ సమయానికి లబ్ధిదారుడు వెళ్లి పరీక్షించుకోవాలి. ఒక వేళ ఎవరైనా ఈ పరీక్షకు హాజరుకాకపోతే తరువాత నెల పింఛన్‌ను హోల్డ్‌లో పెడతారు. వైకల్య శాతం నిర్ధారించుకొని అర్హత సాధిస్తేనే పింఛన్‌ కొనసాగిస్తారు. లేకుంటే తొలగిస్తారు. ఈ పరిణామంతో బోగస్‌ పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో గుబులు రేగింది.

పక్కాగా తనిఖీ

దివ్యాంగ పింఛన్ల తనిఖీని పక్కాగా చేపడతాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశాం. ప్రత్యేక వైద్య బృందాలను నియమించాం. అర్హులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. లబ్ధిదారులు సమగ్రంగా తమ వివరాలను అందించాలి. బోగస్‌ పింఛన్లు లేకుండా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్దితో ముందుకెళుతోంది. లబ్ధిదారులు సహకరించాలి.

- అంబేడ్కర్‌, కలెక్టర్‌, విజయనగరం

------------------

Updated Date - Jan 06 , 2025 | 12:13 AM