ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

happy new year: కొంగొత్త ఆశలతో..

ABN, Publish Date - Jan 01 , 2025 | 12:31 AM

happy new year: జిల్లా ప్రజలు కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2024కు వీడ్కో లు చెబుతూ.. 2025కు ఘన స్వాగతం పలికారు.

సంతకవిటి మండలం సిరిపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2025కు ఆహ్వానం పలుకుతూ విద్యార్థుల ప్రదర్శన

- యువతలో నూతనోత్సాహం

- అర్ధరాత్రి కేక్‌లు కట్‌ చేసి వేడుకలు

- జిల్లా అభివృద్ధి కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

విజయనగరం డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలు కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2024కు వీడ్కో లు చెబుతూ.. 2025కు ఘన స్వాగతం పలికారు. మంగళవారం అర్ధరాత్రి కేక్‌లను కట్‌చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. గత ఏడాది తొలి ఐదు నెలల్లో నిరాశతో గడిచినా, తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో యువతలో నూతనోత్సహం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం యువతకు మేలు జరిగేలా ఉద్యోగ ప్రకటనలు, ఉపాధి అవకాశాలకోసం పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో వారిలో ఆశలు చిగురించాయి. 2025లో విద్య, వైద్యం, వ్యవసాయ తదితర రంగాలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నివర్గాల ప్రజలు ఆశిస్తున్నారు.


- విజయనగరంలోని గంటస్తంభం వద్ద కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు గంటస్తంభం సైరన్‌ మోగించగానే, ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఎస్‌.కోట, గజపతినగరం, బొబ్బిలి, గంట్యాడ, నెల్లిమర్ల, గుర్ల, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించా రు. ప్రధాన కూడళ్లల్లో యువత కేక్‌లను కట్‌ చేశారు. పుష్పగుచ్ఛాలు,స్వీట్స్‌, పండ్ల దుకాణాలు కిటకిటలాడాయి. వివిధ ఆకారాల్లో కేక్‌లను విక్రయించారు. మద్యం దుకాణాల్లోనూ అర్ధరాత్రి వరకూ జోరుగా విక్ర యాలు సాగాయి. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు ప్రత్యేక లైటింగ్‌ ఏర్పా టు చేశాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు విద్యుత్‌ దీపాలతో శోభయామనంగా కనిపించాయి.

Updated Date - Jan 01 , 2025 | 12:31 AM