ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి బీసీ

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:06 AM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేద రైతుల కోసం గోకులం షెడ్ల పథకాన్ని ప్రారంభించామని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.

తిమ్మాపురంలో గోకులం షెడ్‌ ప్రారంభిస్తున్న మంత్రి

బనగానపల్లె, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేద రైతుల కోసం గోకులం షెడ్ల పథకాన్ని ప్రారంభించామని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో రూ.2.30 లక్షలతో నిర్మించి గోకులం షెడ్‌ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గోకులంషెడ్ల పథకాన్ని పూర్తిగా ఆపివేసిందన్నారు. రాష్ట్రంలోని పేద రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఈపథకాన్ని తమ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ గోకులాలు మంజూరు చేస్తామన్నారు. రైతులు గోకులాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బనగానపల్లె మండల మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు పీవీ.కుమార్‌రెడ్డి, తిమ్మాపురం అల్లె శంకర్‌రెడ్డి, అల్లె నాగేశ్వరరెడ్డి, రామతీర్థం మద్దిలేటి, నందివర్గం శేషారెడ్డి, ఉమామహేశ్వరరావు, జిల్లెల్ల సుబ్బారెడ్డి, ఆంజనేయులు, వెంకటయ్య, వెంగన్న, వల్లెపుశంకర్‌, ఎనఆర్‌ఈజీఎ్‌స పీడీ జనార్దనరావు, ఏపీడీ నరసింహారెడ్డి, ఏపీఓ పాల్గొన్నారు.

నీచ రాజకీయాలు చేస్తే సహించేది లేదు

ఆళ్లగడ్డ (శిరివెళ్ల), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెనల జారీలో జరిగిన తొక్కిసలాటపై వైసీపీ నాయకులు నీచరాజకీయాలు చేస్తే సహించేది లేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మండలంలోని కోటకందుకూరు గ్రామంలో నిర్మించిన మినీ గోకులంషెడ్డును ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. నియోజకవర్గానికి 120 గోకులం షెడ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 30 షెడ్లు పూర్తయ్యాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ శీలం హరికుమార్‌రెడ్డి, నాయకులు రామ్మోహనరెడ్డి, ఆర్ల సుబ్బయ్య, నరసింహుడు, కొండయ్య, చాంద్‌బాషా, లక్ష్మయ్య, ఉసేనవలి పాల్గొన్నారు.

ఫ శిరివెళ్ల గుండంపాడు గ్రామంలో రైతు రామేశ్వరగౌడ్‌ నిర్మించిన మినీ గోకులం షెడ్డును టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంతరెడ్డి శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మురళీ, గ్రామ సర్పంచ సంగిరెడ్డి మౌనిక, టీడీపీ నాయకులు సారెడ్డి రామనాగిరెడ్డి, అన్నెం విజయభాస్కర్‌రెడ్డి, పుల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:06 AM