పోలవరంలో డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

ABN, Publish Date - Apr 04 , 2025 | 12:30 AM

మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో జిల్లా బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి.

పోలవరంలో డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు
తహసీల్దారు కార్యాలయం ఆవరణలో డాగ్‌ , బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

పోలవరం, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో జిల్లా బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఇటీవల చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల భారీ ఎన్‌కౌంటర్లు జరిగిన నేపథ్యంలో ముంద స్తు జాగ్రత్తగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఈ బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందంలో పీసీలు రాపాక నవీన్‌, డాగ్‌ హ్యాండ్లర్‌ రామాంజనేయులు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:30 AM