ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భీమవరంలో రూ.24 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:53 PM

భీమవరం ప్రభుత్వాసుపత్రికి రూ.24కోట్లతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను మంజూరు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

దాత సత్యనారాయణరాజును సన్మానిస్తున్న మంత్రి సత్యకుమార్‌, డిప్యూటీ స్పీకర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ రామరాజు, బాపిరాజు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ఆకివీడు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): భీమవరం ప్రభుత్వాసుపత్రికి రూ.24కోట్లతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ను మంజూరు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. స్థానిక సీహెచ్‌సీ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.1.99కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఓపీ విభాగాన్ని, రూ.65లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నాలుగు పడకల డయాలసిస్‌ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, కలెక్టర్‌ చదలవాడ నాగరాణితో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలు పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న వైద్య సహాయాలపై వైద్యులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా నిరంతరాయంగా పనిచేయడానికి అవసరమైన వైద్య, టెక్నికల్‌ తదితర సిబ్బందిని కూడా ఏర్పాటుచేసిన దాత దాట్ల సత్యనారాయణరాజు అభినందనీయులన్నారు. ఉద్దానంలో సుమారు 34వేల కిడ్నీ కేసులున్నాయని, సీకేడిగా మారకుండా నిరంతర సేవలను అందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. గత ప్రభుత్వం నాణ్యతలేని మద్యం సరఫరా కారణంగా 1300 శాతం కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగారని, ఎన్నో కుటుంబాలు చిధ్రం అయ్యాయన్నారు. మన రాష్ట్రంలో లక్ష మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారని అన్నారు. ప్రస్తుత జీవనశైలి కారణంగా క్యాన్సర్‌ వంటి రోగాలను నిరోధించేందుకు ఎన్సీడీ సర్వేను ప్రస్తుతం నిర్వహిస్తున్నామన్నారు. సర్వే నివేదికలను రెండు నెలలు అధ్యయనం చేసి రానున్న ఆరు నెలలో క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హార్ట్‌ ఎటాక్‌ నివారణకు ముందస్తుగా పీహెచ్‌సీలలో ఇంజక్షన్‌ అందుబాటలో ఉంచడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులకు చెందిన 965 మందిని మరణించకుండా కాపాడుకోకలిగామన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:53 PM