ఎర్రకాలువలో రైతు గల్లంతు
ABN, Publish Date - Apr 04 , 2025 | 12:32 AM
లక్కవరం గ్రామానికి చెందిన రైతు చల్లా బసవయ్య (70) పశువులను మేపడానికి వెళ్లి ఎర్రకాలువలో పడి గల్లంతయ్యాడు.
జంగారెడ్డిగూడెం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): లక్కవరం గ్రామానికి చెందిన రైతు చల్లా బసవయ్య (70) పశువులను మేపడానికి వెళ్లి ఎర్రకాలువలో పడి గల్లంతయ్యాడు. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరం గ్రామానికి చెందిన చల్లా బసవయ్య ప్రతీ రోజు పశువులను మేపి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాడు. గురువారం సాయంత్రం పొలంలో పశువులు మాత్రమే వస్తుండడంతో స్థానికులు ఇంటికి వెళ్లి సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. వెతికారు. ఎర్రకాలువ ఒడ్డున బసవయ్య చెప్పు లు, టవల్, కర్ర ఉండడంతో పశువులను కడగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యా డని భావించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో రాత్రి పొద్దు పోయేవరకు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ లభ్యం కాలేదు. లక్కవరం ఎస్సై శశాంక సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు పర్యవేక్షించారు.
Updated Date - Apr 04 , 2025 | 12:32 AM