ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిలకడగా నిత్యావసరాలు!

ABN, Publish Date - Apr 06 , 2025 | 11:38 PM

నిత్యావసరాల ధరలు నిలకడగానే కొన సాగుతున్నాయి. ప్రధానంగా నిత్యావసరాలు రైతుల నుంచి చేపట్టిన దిగుమతులపై 1.27 శాతం సుంకం వసూళ్లను చేపడుతుండ టంతో ధరలు నిలకడగా ఉంటున్నాయి.

సన్‌ఫ్లవర్‌ బ్రాండెడ్‌ కంపెనీ ధరలు హెచ్చు

మార్కెట్‌లో కిలో సన్‌ఫ్లవర్‌ రూ.147, వేరుశెనగ రూ.150

ఎండుమిర్చి, వెల్లుల్లి యఽఽథాతథం

పచ్చళ్ల సీజన్‌కు కొంత ఊరటే

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

నిత్యావసరాల ధరలు నిలకడగానే కొన సాగుతున్నాయి. ప్రధానంగా నిత్యావసరాలు రైతుల నుంచి చేపట్టిన దిగుమతులపై 1.27 శాతం సుంకం వసూళ్లను చేపడుతుండ టంతో ధరలు నిలకడగా ఉంటున్నాయి. ప్రభుత్వం వివిధ వర్తక, వ్యాపారాలపై దాడు లు, నిత్యావసరాల అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరి కల నేప థ్యంలో ధరవరలు అందుబాటులోనే ఉంటు న్నాయి. గత నెల రోజులుగా ధరలు యథా తథంగా కొనసాగుతున్నాయి. ఆయిల్‌ ధరల్లో కొంత హెచ్చు,తగ్గులు పది రోజుల నుంచి చోటు చేసుకుంటున్నాయి. సన్‌ఫ్లవర్‌ ఎక్కు వగా ఉక్రెయిన్‌, రష్యాల నుంచి క్రూడ్‌గా మన దేశంలోనికి వస్తుంది. అయితే ప్యాకేజీ మాయాజాలం జరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ఎక్కువగా వాడే సన్‌ఫ్లవర్‌ విషయం లోనే ఈ విధానాన్ని పాటిస్తూ బ్రాండెడ్‌ ఆయిల్‌ కంపెనీలు హెచ్చు ధరలకు అమ్మ కాలు సాగిస్తున్నాయి. కిలో రూ.142కు విక్ర యించే ఓ బ్రాండెడ్‌ కంపెనీ ఇటీవల రూ.147 నుంచి రూ.150కి విక్రయాలను చేస్తోంది. ప్యాకెట్‌పై ఎక్కువ ధరను చూపించి, కొంచెం తగ్గించినట్టుగా కొనుగోలు దారులకు చూపిస్తు న్నారు. ఇక షాపింగ్‌ మాల్స్‌, ఇతర పెద్ద కొన్ని బ్రాండెడ్‌ మాల్స్‌లోను ప్యాకెట్‌పైన ఉన్న ధరకే విక్రయిస్తున్నారు. వేరుశెనగ నూనె, గానుగ బయట దుకాణాల్లో రూ.165 నుంచి రూ.170 లకు విక్రయిస్తున్నారు. ఎక్కువగా వేరుశెనగ పండే గుజరాత్‌లో బఫర్‌ నిల్వలుండటం వల్ల వేరుశెనగ నూనె ధరల్లో పెరుగుదల ఇప్పట్లో ఉండదని చెబుతున్నారు. కాగా ఎక్కువ మంది ప్యాకెట్ల కొనుగోలుపైన ఆధారపడడంతో ఆయా కంపెనీలు ధరలను రూ.2 నుంచి రూ.4 వరకు పెంపును అమలు చేస్తున్నాయి. రైస్‌ రిచ్‌ ఆయిల్‌ డీమార్ట్‌లో రూ.110, మిగతా చోట్ల బయట మార్కెట్‌లో రూ.125 కిలో ప్యాకెట్‌ విక్రయాలు జరుగుతున్నాయి. మధ్య తరగతి ప్రజలు వాడే పామాయిల్‌లో లీటరు ప్యాకెట్‌ రూ.145కు, 800 గ్రాముల ప్యాకెట్‌ల రూపం లో రూ.120లకు విక్రయాలు జరుగుతున్నాయి. బియ్యం ధరలు కిలో రూ.65, రూ.67 పలుకుతున్నాయి. జీఎస్టీ అమలుతో ఈ ధరలకు కళ్లెం పడడం లేదు. మినపగుళ్లు రూ.140, నల్ల మినుములు రూ.120లకు విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త పంట అందుబాటులోకి వచ్చినా ధరలు యథాతథంగానే ఉండడం గమనార్హం.

ఆవకాయకు ఊరటే..

ఈసారి ఎండుమిర్చి ఎగుమతులు గుంటూరు నుంచి కొంత స్తంభించాయి. దీంతో బహిరంగ మార్కెట్‌లో ఎండుమిర్చి ధర దిగి వచ్చింది. కూరలకు వాడే కారం కాయలు కిలో రూ.160–180లకు లభిస్తు న్నాయి. గతేడాది రూ.220 పైనే అమ్మకాలు సాగాయి. పచ్చళ్లకు వాడే పాపడాలు కిలో రూ.300 పలుకుతుండగా గతేడాది రూ.400 పైనే అమ్మారు. బాడిగ(కర్ణాటక) రకం ఇప్పు డు కిలో రూ.200 అమ్మకాలు జరుగుతు న్నాయి. ధనియాలు కిలో రూ.120, వెల్లుల్లి రూ.120–రూ.150, జీలకర్ర రూ.300, మెంతు లు, ఆవాలు రూ.140 పలుకుతున్నాయి.

పేదలకు అందని కందిపప్పు

కందిపప్పు ధర కిలో రూ.160కు పైనే అమ్మకాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక రేషన్‌ కార్డుదారులకు కందిపప్పును అందుబాటులోకి తేకపోవడం కొంత విమర్శలకు దారితీస్తోంది.

Updated Date - Apr 06 , 2025 | 11:38 PM