గాంధేయవాది కృష్ణభారతి మృతి
ABN, Publish Date - Mar 24 , 2025 | 12:21 AM
తాడేపల్లిగూడెంకు చెందిన గాంధేయవాది పసల కృష్ణభారతి (92) హైదరాబాద్‌లోని సోదరి నివాసం వద్ద అనారోగ్యంతో ఆదివారం మృతి చెందా రు.

తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంకు చెందిన గాంధేయవాది పసల కృష్ణభారతి (92) హైదరాబాద్‌లోని సోదరి నివాసం వద్ద అనారోగ్యంతో ఆదివారం మృతి చెందా రు. ఆమె తండ్రి పసల కృష్ణమూర్తి, తల్లి అంజలక్ష్మి స్వాతంత్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. వారిని బ్రిటిష్ ప్రభుత్వం జైలుకు పంపడంతో కృష్ణ భారతి కారాగాంలోనే జన్మించారు. కృష్ణభారతి మొద టి నుంచి గాంధేయ వాదిగానే జీవించారు. వివాహం కూడా చేసుకోకుండా గాంధేయ జీవితం గడిపారు. కృష్ణభారతిని 2022లో భీమవరంలో అల్లూరి సీతారా మరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా ఆహ్వానించి పాదాభివందనం చేసి సత్కరించారు. ఆమె మృతితో తాడేపల్లిగూడెంలో విషాద చాయలు అలముకున్నాయి.
కృష్ణభారతి సేవలు మరువలేం
స్వాతంత్య్ర పోరాట చరిత్రకు ఆనవాలు చెందిన కృష్ణభారతి. ఆ మృతి కలచివేసింది. ఆమె సేవలు మరువలేం. ఆమె కుటుంబం స్వాతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారు. స్వాత్రంత్య ఉద్యమానికి ఆనవాలుగా ఉన్న చిట్టచివరి మహిళగా ఆమె లేని లోటు తీర్చలేనిది.
బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే
ఆమె జీవితం స్ఫూర్తిదాయకం
కృష్ణభారతి గాంధేయవాదిగా అతి నిరాడంరంగా జీవించారు. ఆమె జీవితం మాకు స్ఫూర్తిదాయకం. పేద విద్యార్థు ల చదువుకు ఆమె ఎంతగానో తోడ్పాడ్డారు. ఆమె దాతృత్వ కార్యక్రమాలు తమకు ఎంతో స్పూర్తిని కలిగించాయి. మా మేనత్త మాకు ఎంతో గర్వకారణం.
భోగిరెడ్డి ఆదిలక్ష్మి
స్ఫూర్తిదాయక మహిళను కోల్పోయాం
కృష్ణభారతి మృతి విచారం కలిగించింది. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో అంజలక్ష్మి, పసల కృష్ణమూర్తి దంపతులది ప్రత్యేక స్ధానం. తల్లిదండ్రుల త్యాగాలు, పోరాట స్ఫూర్తితో కృష్ణ భారతి గాంధేయవాదిగా, సంఘ సేవకురాలిగా, జాతీయ ఉద్యమాలకు కట్టుబడి పనిచేశారు. ఆమె మృతితో స్వాతంత్య్ర ఉద్యమ కాలంనాటి ఒక స్ఫూర్తిదాయక మహిళను తాడేపల్లిగూడెం పట్టణం కోల్పోయింది.
డి.సోమసుందర్, ఐజేయూ జాతీయ కార్యదర్శి
Updated Date - Mar 24 , 2025 | 12:21 AM