కొలిక్కితెచ్చేలా !
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:11 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రభుత్వం నిర్దేశిం చినట్టుగా రానున్న రెండేళ్లలో పూర్తి కావాలి. దీనికంటే ముందు ముంపు గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి వారందర్ని పునరావాస కాలనీ లకు తరలించాలి. గత ఏడేళ్లుగా నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయిస్తు న్నట్టు ప్రకటనలు వెలువడుతూనే వచ్చాయి.

పోలవరం నిర్వాసిత కాలనీలకు హంగులు
ఇళ్లు పూర్తి చేసేందుకు మళ్లీ టెండర్లు
ఇంతకు ముందు నిలిచిన పనులకు శ్రీకారం
రూ.920 కోట్లకు మంత్రివర్గ ఆమోదం
ముంపు గ్రామాలను ఖాళీ చేసేందుకు కసరత్తు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రభుత్వం నిర్దేశిం చినట్టుగా రానున్న రెండేళ్లలో పూర్తి కావాలి. దీనికంటే ముందు ముంపు గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి వారందర్ని పునరావాస కాలనీ లకు తరలించాలి. గత ఏడేళ్లుగా నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయిస్తు న్నట్టు ప్రకటనలు వెలువడుతూనే వచ్చాయి. కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు సైతం సాగలేదు. ఈక్రమంలో ఇప్పటికే వివిధ కాలనీల్లో మిగిలిపోయిన నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసేందుకు తిరిగి టెండర్లు, దీని నిమిత్తం రూ.920 కోట్లు కేటాయించేందకు తాజాగా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
పోలవరం నిర్వాసిత కాలనీల్లో ఇప్పటికే ఆగిన ఇళ్లలన్నింటిని త్వరలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కాలనీల నిర్మాణానికి కుదిరిన ఒప్పందా లను రద్దు చేసుకుని ఇప్పుడు తాజాగా మరో మారు టెండర్లు పిలిచి టెండర్లు పిలవాలని సంకల్పించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పరిఽధిలో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం, ఎటపాక వంటి ఏడు ముంపు మండలాలు ఉన్నాయి. వీటిలో ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. వేలే ుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాలు ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, మిగతా మండలాలన్నీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం ఆరంభమైన నాటి నుంచి ఈ మండ లాలన్నింటిలోను ఏదోక వివాదం తొంగి చూస్తూనే వచ్చింది. వాస్తవానికి 2014–19 మఽఽఽధ్య నిర్వాసిత కాలనీల్లో నిర్మాణాలు శరవేగంగా సాగాయి. అప్ప ట్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 70 శాతం మేర పూర్తవ్వడంతో కాలనీ లకు కొంత వన్నె తెచ్చి నిర్వాసితులను అక్కడికి తరలించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. 2019–24 మఽధ్య జగన్ ప్రభుత్వ హయాంలో కాలనీల్లో పెండింగ్ పను లను గాలికొదిలేశారు. కొందరు నిర్వాసితులు తమకు ఇవ్వాల్సిన పరిహారం, జగన్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేయా ల్సిందేనని అప్పటి వరకు కాలనీల్లోకి వెళ్లబో మని భీష్మించారు. ఇప్పటికీ నిర్వా సిత కాలనీల్లో నిర్మాణం పూర్తికాని ఇళ్లు వందల్లోనే ఉన్నాయి. కుక్కునూరు మండలంలో కివ్వాక, దాచారం, వెంకటాపురం, మర్రిపాడుల్లో నిర్వాసిత కాలనీ ల్లో ఇంకా అనేక ఇళ్లను నిర్మించాల్సి ఉంది. జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం పంచా యతీ పరిధిలో తెల్లవరం, రాచన్నగూడెం పంచా యతీలో శివగిరి, రౌతుగూడెం పంచాయతీలో తాటికొట్కూరుగొమ్మి, జీలుగుమిల్లిలో ఎర్రవరం, వంకావారిగూడెం పంచాయతీలో వాడపల్లి, కామయ్యపాలెంలో మామిడిగొంది, టి.అంకం పాలెంలో టేకూరు, కొరుటూరు, దబ్బగూడెంలో రేపాకగొమ్మి వంటి నిర్వాసిత కాలనీలుండగా వీటన్నింటిల్లోను ఇళ్లైతే నిర్మించారు కానీ అక్కడ క్కడ వసతుల్లేని పెండింగ్ నిర్మాణాలు ఉన్నా యి. వీటిన్నంటిని ఒక కొలిక్కి తేబోతున్నారు.
ఇప్పడేమి జరగబోతుందంటే..?
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒకవైపు డయాఫ్రం వాల్ నిర్మాణం అనుకున్న లక్ష్యం మేరకు ఈ ఏడాదంతానికి పూర్తి కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు కేంద్రం సాయం తోడై మరింత ప్రోత్సాహాన్నిస్తోంది. తాజాగా బడ్జెట్‌లోను, అంతకు ముందు పోలవరం నిర్మాణానికి ఎవరూ ఊహించన విధంగా నిధులు కేటా యించారు. 2027 నాటి కల్లా పనులు సంపూర్తి చేయడానికి కాంట్రాక్టు ఏజన్సీలకు తగిన నిర్దేశం చేశారు. ఈలోపే ముంపు గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలన్నింటిని సహాయ,పునరావాస కాలనీ లకు తరలించాలన్న ఇంకో లక్ష్యం ఉంది. ఏడు ముంపు మండలాల్లో ఇంతకముందే నిర్వాసిత కుటుంబాలకు 50 కాలనీల్లో 11 వేలకు పైగా పక్కా ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. దీనికి గాను అప్పట్లో 1,618 కోట్ల వ్యయంతో ఒప్పందం చేసుకుని దీనిలో భాగం గా రూ.1,190 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా మిగి లిన రూ.400 కోట్లకు పైగా పనులను గాలికొదిలే శారు. ఇప్పటికిప్పుడు ఈ పనులన్నింటిని తిరిగి ప్రారంభించాలంటే ఇంతకుముందు వ్యయం కంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. దీనికోసం దాదాపు రూ.700 కోట్లకు పైగా ప్రభు త్వం చెల్లించాల్సి ఉంది. అయితే పాత, కొత్త ప్రతిపాదనలంటూ కాలయాపన చేయడం తగ దని భావించి, ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఏవైతే కాలనీల నిర్మాణానికి ఒప్పందం కుదు ర్చుకున్నారో వాటన్నింటిని రద్దు చేయాలని నిర్ణ యించారు. మిగతా పెండింగ్ పనులన్నింటిని పూర్తి చేసేందుకు దాదాపు రూ.920 కోట్ల వ్యయానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. దీంతో స్వల్ప కాలిక టెండర్ల మేరకు పనులు చేపట్టి పూర్తి చేయ బోతున్నారు. సమస్త సౌకర్యాలు సమకూర్చి నిర్వాసిత కుటుంబాలు కాలనీలకు తరలి వచ్చే లా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
Updated Date - Feb 10 , 2025 | 12:11 AM