46 ప్రైవేటు బస్సులపై కేసులు

ABN, Publish Date - Mar 28 , 2025 | 12:00 AM

మోటారు వాహన నిబంధనలు అతిక్రమించిన 46 కాంట్రాక్టు బస్సులు (ప్రైవేటు ట్రావెల్స్‌)పై కేసులు నమోదు చేసి లక్షా 13 వేల రూపా యలు అపరాధ రుసుము విధించామని ఏలూ రు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్టు కమిషనర్‌ షేక్‌కరీమ్‌ తెలిపారు.

46 ప్రైవేటు బస్సులపై కేసులు
ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ అధికారులు

రూ.1.13 లక్షల జరిమానా విధించిన రవాణా శాఖ అధికారులు

ఏలూరు క్రైం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : మోటారు వాహన నిబంధనలు అతిక్రమించిన 46 కాంట్రాక్టు బస్సులు (ప్రైవేటు ట్రావెల్స్‌)పై కేసులు నమోదు చేసి లక్షా 13 వేల రూపా యలు అపరాధ రుసుము విధించామని ఏలూ రు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్టు కమిషనర్‌ షేక్‌కరీమ్‌ తెలిపారు. ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌గేటు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు నిరవధికంగా ప్రైవేటు కాంట్రాక్టు బస్సుల తనిఖీలను నిర్వహించామన్నారు. రహదారి భద్రతలో భాగంగా డ్రైవర్లకు ఫేస్‌వాష్‌ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించామన్నారు. డ్రైవింగ్‌ విరామ సమయంలో డ్రైవర్లు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని హితవు పలికారు. ఈ తనిఖీలలో వాహన తనిఖీ అధికారు భీమారావు, ఎన్‌డీ విఠల్‌, ఎస్‌వీ శేఖర్‌, జి.ప్రసాదరావు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:00 AM