ఏలూరులో తండేల్‌ చిత్ర యూనిట్‌ సందడి

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:19 AM

మత్స్యకారుల దయనీయ పరిస్థితిని అద్దంపట్టే తండేల్‌ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారని హీరో నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి అన్నారు.

ఏలూరులో తండేల్‌ చిత్ర యూనిట్‌ సందడి
ఏలూరు అంబికా థియేటర్‌లో ప్రేక్షకులతో మాట్లాడుతున్న హీరో నాగ చైతన్య

ప్రేక్షకులతో ముచ్చటించిన హీరో నాగ చైతన్య

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల దయనీయ పరిస్థితిని అద్దంపట్టే తండేల్‌ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారని హీరో నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి అన్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆదివారం నగరంలో సందడి చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి హీరో యిన్‌గా నటించిన చిత్రంలో దేశభక్తి, లవ్‌స్టోరీ ప్రేక్షకులను అలరిస్తోంది. చిత్రం విజయయాత్ర లో భాగంగా హీరో నాగచైతన్య, డైరెక్టర్‌ చందు మొండేటి ఏలూరు అంబికా థియేటర్‌లో మ్యా ట్నీషోలో సందడి చేశారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ రెండేళ్ల కష్టం చిత్రం విజయంతో మర్చిపోయామన్నారు. ఇంతటి అఖండ విజయా న్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపా రు. చిత్రంలోని పలు డైలాగులు చెప్పి ప్రేక్షకు లను అలరించారు. డైరెక్టర్‌ చందు మొండేటి మాట్లాడుతూ అన్ని థియేటర్లలో విజయవంతం గా ఈ చిత్రం ప్రదర్శించడం సంతోషంగా ఉంద న్నారు. తొలుత ప్రముఖ నిర్మాత అంబికాకృష్ణ, యూనిట్‌ సభ్యులకు ఘనస్వాగతం పలికారు. తాత అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్‌) తండ్రి నాగార్జున పేరును నాగచైతన్య నిలబెడుతున్నా రని ప్రశంసించారు. నాగచైతన్యతో సెల్ఫీ కోసం యువకులు ఎగబడ్డారు. నాగచైతన్య అభిమాన సంఘం భారీ గజమాలతో సత్కరించారు.

Updated Date - Feb 10 , 2025 | 12:19 AM