ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అలసత్వం వీడండి

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:36 AM

అభివృద్ధి పనులు పూర్తి చేయడం, సంక్షేమ పథకాల అమలులో అధికారులు అలసత్వం వీడాలని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మహేశ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మశ్రీ, అధికారులు

అభివృద్ధి పనుల్లో అధికారుల తీరుపై ఎమ్మెల్యేల నిరసన

వాడి వేడిగా జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

ఏలూరు సిటీ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులు పూర్తి చేయడం, సంక్షేమ పథకాల అమలులో అధికారులు అలసత్వం వీడాలని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. ఏలూరులోని జడ్పీ కార్యాలయంలో బుధవారం జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఎమ్మె ల్యేలు, జడ్పీటీసీ సభ్యులు పలు సమస్యలు ప్రస్తావించారు. ప్రభుత్వ విప్‌, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జల్‌జీవన్‌ మిషన్‌ పనుల్లో అధికారులు అలసత్వ ఽధోరణి తగదని, కాంట్రాక్టర్లతో పనులు వేగవం తంగా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తయిన అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు, రానున్న రోజుల్లో చేపడుతున్న రహదా రుల అభివృద్ధి పనులకు ఈనెలలోనే శంకుస్థాప నలు చేసేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. విద్యుత్‌ శాఖపై చర్చ జరుగుతుం డగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ మాట్లాడుతూ సూర్యఘర్‌ యోజనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. పథకాల అమలును అధికారులు ఎమ్మెల్యేలకు తెలియజేయాలన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ య్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాల న్నారు. ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ పాఠశాల విద్య ప్రమాణాలు పెంచేదిశగా విద్యాశాఖాధికారులు కృషి చేయాలన్నారు.

రోడ్ల పనులు పూర్తి చేయాలి : ఎంపీ

జిల్లాలో రూ. 97 కోట్లతో చేపట్టిన ఆర్‌అండ్‌బి రహదారుల అభివృద్ధి పనులను యుద్ధప్రాతి పదికన పూర్తి చేయాలని అధికారులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేవ్‌కుమార్‌ సూచించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం ప్రఽధాన రహదారుల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాల న్నారు. కైకలూరు, పోలవరం, ఉంగుటూరు, దెం దులూరు, చింతలపూడి నియోజకవర్గాల పరి ధిలో 13 రహదారుల మరమ్మతు పనులు చేప ట్టినట్లు చెప్పారు. పనులు పూర్తి నాణ్యతతో నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. స్థాయి సంఘ సమావేశాల్లో జడ్పీ సీఈవో కెఎస్‌ఎస్‌ సుబ్బారావు, డిప్యూటి సీఈవో కె భీమేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేయండి : పద్మశ్రీ

జిల్లాలో అభివృద్ధి పనులు, రహదారుల పను లు త్వరితగతిన పూర్తి చేయాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ ఘంటా పద్మశ్రీ అధికారులకు సూచిం చారు. రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవం తంగా నిర్వహించాలన్నారు. 3, 5, 6 కమిటీల స మావేశాలు జడ్పీ సీఈవో ఛాంబర్‌లో జరిగాయి. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌, ఎమ్మెల్యే లు బడేటి చంటి), బొలిశెట్టి శ్రీనివాసరావు, పత్స మట్ల ధర్మరాజు, బొమ్మిడి నాయకర్‌, మద్దిపాటి వెంకట్రాజు, ఎమ్మెల్సీ గోపిమూర్తి, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బి రహదారుల పనుల పురోగతి, మంచినీటి పథకా ల పనులు, కాల్వలకు నీటి విడుదల, తాత్కాలిక మరమ్మతులు, ఎంపీ ల్యాడ్స్‌ వినియోగం, సోలా ర్‌ విద్యుత్‌, జిల్లాలో సోలార్‌ మోడల్‌ గ్రామాలు, రైతులకు ఉచిత విద్యుత్‌, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన పథకం ప్రగతిపై చర్చించి అధికారులకు తగు సూచనలు చేశారు.

Updated Date - Jan 09 , 2025 | 12:36 AM