వైకల్యం అధిగమించాలి
ABN, Publish Date - Apr 04 , 2025 | 12:28 AM
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వైకల్యాన్ని అదిగమించి ముందుకు సాగాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు.

ప్రత్యేక అవసరాలు గల 852 మందికి ఉపకరణాల పంపిణీ
రాష్ట్రంలో ఏలూరు జిల్లా నుంచే శ్రీకారం
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వైకల్యాన్ని అదిగమించి ముందుకు సాగాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలుగల పిల్లల (సీడబ్ల్యుఎస్‌ఎన్) కు ప్రభుత్వం సరఫరా చేసిన ఉపకరణాలను గురువారం వారు అందజేశారు. సమగ్రశిక్ష ఆధ్వ ర్యంలో ఉపకరణాల పంపిణీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో తొలిసారిగా ఏలూరు జిల్లా నుంచే ప్రారంభించారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వైకల్యంతో ఉన్న 928 మందిని బాలబాలికలను గుర్తించారు. వారిలో 852 మందికి ఉపకరణాలు అవసరమని ఎంపిక చేశారు. కలెక్టర్ వెట్రిసెల్లి మాట్లాడుతూ ఏకకాలంలో 852మందికి ఉపకరణాలు అంద జేసి ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. ప్రభుత్వం నిర్వహి స్తోన్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెర పిస్టులు, ప్రత్యేక ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే చంటి మా ట్లాడుతూ సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా ప్రభుత్వపరం గా అన్ని సదుపాయాలను కల్పిస్తా మన్నారు. సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ కె.పంకజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకోసం సీపీ చైర్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు, టీఎల్‌ఎం కిట్లు అందజేసిందన్నారు. రూ.75లక్షలు ఖరీదుచేసే ఉపకరణాలను జిల్లా లోని ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు భవిత కేంద్రాల ద్వారా పంపిణీ చేశామన్నారు. సమగ్రశిక్ష విలీనవిద్య జిల్లా కోఆర్డినేటర్ భాస్కరరాజు మాట్లాడుతూ మీరట్‌కు చెందిన అలింకో కంపెనీ తయారుచేసిన ఉపకరణాలపై సంబంధిత విద్యార్థి ఆధార్ నెంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్ ఉంటుందని, వీటికి రెండేళ్లపాటు గ్యారెంటీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కోఆ ప్షన్ సభ్యుడు పెదబాబు, అలింకో సంస్థ ప్రతిని ధులు, బాలబాలికల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Updated Date - Apr 04 , 2025 | 12:28 AM