ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Y.S. Sharmila: అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి

ABN, Publish Date - Jan 11 , 2025 | 03:32 AM

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని పీసీసీ చీఫ్‌ వైౖఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

విశాఖలో గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష

విశాఖపట్నం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని పీసీసీ చీఫ్‌ వైౖఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకత్వం పిలుపు మేరకు ఆమె శుక్రవారం ఉదయం విశాఖలో ‘జై బాపూజీ, జై భీమ్‌, జై సంవిధాన్‌’ కార్యక్రమం నిర్వహించారు. తొలుత నగర పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో అంబేడ్కర్‌ గురించి అమిత్‌ షా హేళనగా మాట్లాడారన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేడ్కర్‌ తన జీవితకాలం పోరాటం సాగించారని, అటువంటి మహనీయుడిని హేళన చేసిన విషయాన్ని దేశమంతా గమనిస్తోందన్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఆమిత్‌ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ సీనియర్‌, పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడారు. అనంతరం పలువురు మహిళలు, వృద్ధులకు షర్మిల దుప్పట్లు పంపిణీ చేశారు. అంతకుముందు ‘జై బాపూజీ, జై భీమ్‌, జై సంవిధాన్‌’ కార్యక్రమ పోస్టరును విడుదల చేశారు. అనంతరం, జీవీఎంసీ కార్యాలయం ఎదురుగాగల గాంధీ విగ్రహం వద్ద షర్మిల 40నిమిషాలపాటు మౌన దీక్ష చేపట్టారు.

Updated Date - Jan 11 , 2025 | 03:32 AM