నాకు న్యాయం చేయండి
ABN, Publish Date - Jan 02 , 2025 | 02:23 AM
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలపై సీఎం చంద్రబాబుకు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.మదన్‌మోహన్ ఫిర్యాదు చేశారు.
సీఎం చంద్రబాబుకు శాంతి భర్త మదన్‌మోహన్ విజ్ఞప్తి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలపై సీఎం చంద్రబాబుకు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.మదన్‌మోహన్ ఫిర్యాదు చేశారు. గత నవంబరులో తనను హైదరాబాద్ నుంచి కోల్‌కతాకు బదిలీ చేశారని, విజయసాయిరెడ్డి వల్లే బదిలీ చేశారని చెప్పారు. తిరిగి తనను హైదరాబాద్‌కు బదిలీ చేయించాలని కోరారు. శాంతి అవినీతి, అక్రమాలను సీఎంకు వివరించారు. విశాఖలో అన్యాక్రాంతమైన భూముల విషయంలో విజయసాయిరెడ్డి, శాంతి పాత్రలపైనా విచారణ జరిపించాలని కోరారు. తన భార్య శాంతికి పుట్టిన బిడ్డకు, విజయసాయిరెడ్డికి డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం సీఎం చంద్రబాబును ఆయన కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు.
Updated Date - Jan 02 , 2025 | 02:24 AM