Share News

సుప్రీంలో వైసీపీ పిటిషన్‌ ఓ డ్రామా: ఫరూఖ్‌ షిబ్లీ

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:02 AM

ఫరూఖ్‌ షిబ్లీ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్‌ను డ్రామా అని విమర్శించారు. వైసీపీ ఎంపీలు రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఇచ్చినా, బిల్లును వ్యతిరేకించారని ఆరోపించారు

సుప్రీంలో వైసీపీ పిటిషన్‌ ఓ డ్రామా: ఫరూఖ్‌ షిబ్లీ

సుప్రీంకోర్టులో వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ పిటిషన్‌ వేయడం ఒక డ్రామా అని రాష్ట్ర మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూఖ్‌ షిబ్లీ విమర్శించారు. మంగళవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వక్ఫ్‌ బిల్లుపై సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన సవరణలను ముస్లిం సమాజం అభినందిస్తోంది. పార్లమెంటు సాక్షిగా జగన్‌ ముస్లింలకు ద్రోహం చేశారు. వైసీపీ ఎంపీలు రాజ్యసభలో బిల్లుకు మద్దతుగా ఓటు వేసి బయట మాత్రం బిల్లును వ్యతిరేకించినట్లు కబుర్లు చెబుతున్నారు’ అని షిబ్లీ అన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 04:02 AM