Sankranti 2025: ఈ వస్తువులను దానం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి..
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:06 PM
మకర సంక్రాంతి రోజున మీరు కొన్ని వస్తువులను దానం చేస్తే, మీ జీవితంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున చేసే దాన ధర్మాలు గత జన్మల పాపాలను పోగొడుతాయని శాస్త్ర నిపుణులు చెబుతారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

మకర సంక్రాంతి 2025: హిందూమతంలో మకర సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి అని అంటారు. మకర సంక్రాంతి సందర్భంగా దానధర్మాలు చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోవడంతో పాటు ఇల్లు సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. అయితే, ఏ ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేస్తే సర్వపాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
మేషం - మేషరాశి వారు ఎరుపు రంగు వస్తువులను దానం చేస్తే వారు జీవితంలో ప్రయోజనం పొందుతారు.
వృషభం - వృషభ రాశి వారు మకర సంక్రాంతి రోజున తెల్ల నువ్వులను దానం చేయడం మంచిది. ఈ రోజున ఏదైనా తెల్లని వస్తువును దానం చేస్తే మీకు శుభం కలుగుతుంది. కానీ ప్రధానంగా బియ్యం లేదా తెల్ల నువ్వులను దానం చేయడం మంచిది.
మిథునరాశి - మకర సంక్రాంతి రోజున మీరు పచ్చని కూరగాయలు లేదా ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేస్తే జీవితంలో ఐశ్వర్యం ఉంటుంది. అలాగే విజయం పొందుతారు.
కర్కాటక రాశి - ఈ రోజు తెల్లని వస్తువులను పేదవారికి దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా తెల్లని వస్త్రాలను దానం చేయాలి. వీలైతే, పాలు, పెరుగు లేదా నెయ్యి దానం చేయండి. ఇది మీ జీవితంలో శ్రేయస్సును తెస్తుంది.
సింహరాశి - మకర సంక్రాంతి రోజున సూర్యునికి సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల సింహరాశి వారికి మేలు జరుగుతుంది. ఈ రోజున బెల్లం, నువ్వులు, వేరుశెనగ, నువ్వుల లడ్డూ దానం చేస్తే మీకు మేలు జరుగుతుంది.
కన్య - కన్యారాశి వారు పచ్చని వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున కిచిడి తయారు చేసి పేదలకు తినిపిస్తే పాపాలు తొలగిపోతాయి.
తులారాశి - తులారాశి వారు మకర సంక్రాంతి రోజున బియ్యం వంటి తెల్లని ధాన్యాలను దానం చేయడం మంచిది. మీరు జీడిపప్పు, తెల్లటి డ్రై ఫ్రూట్స్ కూడా దానం చేయవచ్చు. అంతేకాకుండా ఈ రోజున తెల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
వృశ్చిక రాశి - మకర సంక్రాంతి నాడు బెల్లం దానం చేయండి. ఎర్రని వస్తువులతో పాటు వేరుశెనగ, బెల్లం దానం చేయడం వల్ల ఇంట్లో ఆనందం ఉంటుంది.
ధనుస్సు రాశి - ధనుస్సు రాశి వారు పచ్చి శనగలు, శనగ పిండి, పసుపు బట్టలు వంటివి దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పితృ దోషం నుండి రక్షింపబడతారు.
మకర రాశి - మకర రాశి వారు మకర సంక్రాంతి రోజున శనగలు, నల్ల నువ్వులు వంటివి దానం చేయాలి. పేదలకు దానం చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది.
కుంభం - కుంభరాశి వారు మకర సంక్రాంతి రోజున ఉన్ని బట్టలు, తోలు వస్తువులను దానం చేస్తే ఏడాది పొడవునా మంచి ఫలితాలు ఉంటాయి.
మీనం - మీన రాశి వారు మకర సంక్రాంతి రోజున పసుపు వస్తువులు, ధాన్యాలు, వస్త్రాలు దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Updated Date - Jan 13 , 2025 | 03:06 PM