ఏడీఐఏ నుంచి జీఎంఆర్ గ్రూప్‌నకు రూ.6,300 కోట్లు
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:40 AM
అబుధాబి ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ (ఏడీఐఏ) నుంచి జీఎంఆర్ గ్రూప్‌నకు రూ.6,300 కోట్ల పెట్టుబడి నిధులు అందాయి. జీఎంఆర్ గ్రూప్ ఈ నిధులను ప్రధాన కంపెనీ జీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఈపీఎల్)...
న్యూఢిల్లీ: అబుధాబి ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ (ఏడీఐఏ) నుంచి జీఎంఆర్ గ్రూప్‌నకు రూ.6,300 కోట్ల పెట్టుబడి నిధులు అందాయి. జీఎంఆర్ గ్రూప్ ఈ నిధులను ప్రధాన కంపెనీ జీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఈపీఎల్) రుణభారం తగ్గించేందుకు ఉపయోగించనుంది. ఇందుకు బదులుగా జీఎంఆర్ గ్రూప్ ఈ నెల 7న ఏఐడీఏకు జీఈపీఎల్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఎంటర్‌ప్రైజె్‌సలో ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసింది.
బర్డ్ ఢిల్లీలో వాటా: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్ప్ విమానాశ్రయాల అనుబంధ వ్యాపారాల్లోకీ విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బర్డ్ ఢిల్లీ జనరల్ ఏవియేషన్ సర్వీసెస్ (బీడీజీఏఎ్‌సపీఎల్) ఈక్విటీలో 50 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.15.02 కోట్లు ఖర్చు చేసినట్టు రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది.
Updated Date - Jan 09 , 2025 | 01:40 AM