ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

షామీ ఇండియా నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:47 AM

చైనా స్మార్ట్‌ఫోన్ల కంపెనీ షామీ ఇండియా భారత మార్కెట్‌లో ‘రెడ్‌మీ 14సీ 5జీ’ పేరు తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి...

ధర రూ.9,999 నుంచి రూ.11,999

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చైనా స్మార్ట్‌ఫోన్ల కంపెనీ షామీ ఇండియా భారత మార్కెట్‌లో ‘రెడ్‌మీ 14సీ 5జీ’ పేరు తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ మార్కెటింగ్‌ విభాగం అసోసియేట్‌ డైరెక్టర్‌ సందీప్‌ శర్మ విలేకరులతో చెప్పారు. మూడు రంగులు, మూడు వేరియంట్లలో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తుంది. 50 మెగాఫిక్సెల్‌ (ఎంపీ) కెమెరాతో పాటు సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 8 ఎంపీ కెమెరాను ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ బ్యాటరీ సామర్ధ్యం 5160 ఎంఏహెచ్‌. ఈ ‘రెడ్‌మీ 14సీ 5జీ’ స్మార్ట్‌ఫోన్‌తో పాటు కంపెనీ రూ.1,999 విలువైన 33 వాట్స్‌ చార్జర్‌ను ఉచితంగా ఇస్తోంది. 4జీబీ+64 జీబీ మోడల్‌ రూ.9,999, 4జీబీ+128 జీబీ మోడల్‌ ధర రూ.10,999గా, 6జీబీ+128 జీబీ మోడల్‌ ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. గత ఏడాది విడుదల చేసిన రెడ్‌మీ 13సీ 5జీ మోడల్‌లానే రెడ్‌మీ14సీ 5జీ మోడల్‌కూ వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నట్టు శర్మ చెప్పారు.

Updated Date - Jan 09 , 2025 | 01:47 AM