Apple Supply Chain Shift: భారత్‌లో ఐఫోన్‌ల ఉత్పత్తిని పెంచిన యాపిల్
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:27 PM
అమెరికా చైనా సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో యాపిల్ ఐఫోన్ తయారీ కోసం భారత్‌పై దృష్టి పెట్టింది. మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరించే వ్యూహంలో భాగంగా భారత్‌లో కార్యకలాపాలను పెంచుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ చైనా కేంద్రంగా జరుగుతున్న ఐఫోన్‌ల ఉత్పత్తిని క్రమంగా భారత్‌కు విస్తరిస్తోంది. ప్రస్తుతం 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌ల ఉత్పత్తికి భారత్ వేదికైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని ఐఫోన్‌లల్లో 20 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరోనా సంక్షోభ సమయంలో చైనాలో ఫోన్ల తయారీకి ఎదురైన ఆటంకాలు తదితరాల నేపథ్యంలో యాపిల్ క్రమంగా తన ఐఫోన్ తయారీని చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరిస్తోంది.
కొవిడ్ సంక్షోభ సమయంలోనే ఉత్పత్తి కార్యకలాపాలను యాపిల్ చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లించడం ప్రారంభించింది. ప్రస్తుతం దక్షిణాదిలోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో అధిక శాతం ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నారు. టాటా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రానిక్ విభాగం కూడా ఐఫోన్ అసెంబ్లీలో కీలకంగా ఉంటోంది. ఐఫోన్ సంబంధించి కేవలం అసెంబ్లీకే భారత్ పరిమితం కాలేదు. మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 17.4 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లు ఎగుమతి అయ్యాయి. ఆ తరువాత చైనాపై ట్రంప్ ప్రతీకార సుంకాలతో యాపిల్ దృష్టిలో భారత్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది.
మ్యానుప్యాక్చరింగ్ కార్యకలాపాలను చైనాతో పాటు ఇతర దేశాలకు మళ్లించాలన్న యాపిల్ వ్యూహంలో భాగంగా భారత్‌లో అసెంబ్లీ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. అయితే, ఈ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎనిమిదేళ్లల్లో కేవలం 10 శాతం కార్యకలాపాలు మాత్రం చైనా నుంచి ఇతర దేశాలకు మళ్లాయి. అయితే, ఈ అవకాశాలను అందింపుచ్చుకునేందుకు భారత్ ఛాన్స్ అధికంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ ఫోన్, లాప్‌టాప్, టాబ్లెట్ దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధించకపోవడం కూడా భారత్‌కు లాభించనుంది. అయితే, యాపిల్ దృష్టిలో భారత్ ప్రధాన మార్కెట్‌గా కూడా మారుతోంది. మొత్తం ఐఫోన్ అమ్మకాల్లో 8 శాతం భారత్ కేంద్రంగా జరుగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ విక్రయాలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
మెటా మార్క్ జుకర్‌బర్గ్ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..
Plane Crash: న్యూయార్క్ తర్వాత మరో విమాన ప్రమాదం..ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Read More Business News and Latest Telugu New