Share News

Aurobindo Pharma: అరబిందో రివారోక్సాబాన్‌కు ఎఫ్‌డీఏ గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Apr 14 , 2025 | 02:44 AM

అరబిందో ఫార్మా అభివృద్ధి చేసిన ‘రివారోక్సాబాన్‌’ టాబ్లెట్లకు అమెరికా FDA అనుమతి ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఈ ఔషధాన్ని జూన్‌లోగా అమెరికా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు

Aurobindo Pharma: అరబిందో రివారోక్సాబాన్‌కు ఎఫ్‌డీఏ గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో ఫార్మా మరో ఔషధాన్ని అమెరికాలో మార్కెట్‌ చేయబోతోంది. కంపెనీ అభివృద్ధి చేసిన ‘రివారోక్సాబాన్‌’ టాబ్లెట్లకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. దీంతో కంపెనీ ఈ ట్యాబ్లెట్లను తయారు చేసి, అమెరికాలో మార్కెట్‌ చేసేందుకు అవకాశం ఏర్పడింది. గుండెపోటు నివారణ, రక్తనాళాల్లో రక్తసరఫరా మెరుగుపరిచేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జాన్సెన్‌ ఫార్మా ఇంక్‌ ఈ ఔషధాన్ని ‘క్సారెల్టో’ అనే బ్రాండ్‌ పేరుతో అమెరికాలో 2.5 ఎంజీ సామర్థ్యాలతో విక్రయిస్తోంది. ఇప్పుడు అరబిందో ఫార్మా ఇవే టాబ్లెట్లను జెనరిక్‌ వెర్షన్‌లో ‘రివారోక్సాబాన్‌’ పేరుతో మార్కెట్‌ చేయబోతోంది. ఈ ఏడాది జూన్‌లోగా తమ టాబ్లెట్లను అమెరికా మార్కెట్లోకి విడుదల చేస్తామని వెల్లడించింది. 2025 ఫిబ్రవరితో ముగిసిన 12 నెలల కాలానికి గాను అమెరికాలో ఈ ఔషధ విక్రయాలు 850 కోట్ల డాలర్లు (సుమారు రూ.73,610 కోట్లు)గా ఉన్నాయి.

Updated Date - Apr 14 , 2025 | 02:46 AM