హైదరాబాద్‌లో బ్రిగేడ్ గేట్‌వే ప్రాజెక్టు
ABN, Publish Date - Jan 09 , 2025 | 01:42 AM
బ్రిగేడ్ గ్రూప్ హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టు ప్రారంభించింది. కోకాపేటలోని నియోపోలిస్ వద్ద దాదాపు రూ.4,500 కోట్ల పెట్టుబడితో...
ఒక్కో ఫ్లాట్ ధర రూ.4-12 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): బ్రిగేడ్ గ్రూప్ హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టు ప్రారంభించింది. కోకాపేటలోని నియోపోలిస్ వద్ద దాదాపు రూ.4,500 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో ఇప్పటికే భూసేకరణ ఇతర ఖర్చుల కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్టు బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ (బీఈఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) అమర్ మైసూర్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 10 ఎకరాల్లో 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే చోట వరల్డ్ ట్రేడ్ సెంటర్, బ్రిగేడ్ రెసిడెన్స్, బ్రిగేడ్ ఓరియన్ మాల్, మూడు వందలకుపైగా గదుల సామర్ధ్యంతో ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ ఏర్పాటు చేస్తారు. నాలుగేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్న ఈ ప్రాజెక్టులో ‘బ్రిగేడ్ రెసిడెన్స్’ పేరుతో ఏర్పాటు చేసే వెంచర్‌లో ఒక్కో సూపర్ లగ్జరీ ఫ్లాట్ ధర విస్తీర్ణాన్ని బట్టి రూ.4 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటుంది.
Updated Date - Jan 09 , 2025 | 06:05 AM