India Growth: డేటా సెంటర్ల జోరు

ABN, Publish Date - Mar 15 , 2025 | 02:04 AM

దేశంలో డేటా కేంద్రాల (డీసీ) సంఖ్య భారీగా పెరుగుతోంది. వచ్చే 7-10 సంవత్సరాల్లో ఈ కేంద్రాల నిర్మాణం కోసం కంపెనీలు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.3 లక్షల కోట్లు...

India Growth: డేటా సెంటర్ల జోరు

వచ్చే ఏడేళ్లలో రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడులు : ఇక్రా

న్యూఢిల్లీ: దేశంలో డేటా కేంద్రాల (డీసీ) సంఖ్య భారీగా పెరుగుతోంది. వచ్చే 7-10 సంవత్సరాల్లో ఈ కేంద్రాల నిర్మాణం కోసం కంపెనీలు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. వచ్చే పదేళ్లలో మన దేశంలో ఏర్పాటు చేసే డేటా కేంద్రాల్లో 75 శాతం ముంబై, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఏర్పాటవుతాయని అంచనా వేసింది. ప్రభుత్వ సానుకూల విధానాలు, మౌలిక పరిశ్రమ హోదా కల్పించడం డేటా సెంటర్‌ పరిశ్రమకు కలిసి వచ్చే ప్రధాన అంశాలని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ రేటింగ్స్‌) అనుపమా రెడ్డి చెప్పారు.


క్లౌడ్‌ కంప్యూటింగ్‌, 5జీ టెలికాం సేవల ప్రారంభం, మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ)తో ఏర్పడుతున్న విస్తృత సమాచారం (డేటా), స్టోరేజీ అవసరాలు డేటా కేంద్రాలకు ఇంధనంగా మారుతున్నాయి. దీంతో 2024 డిసెంబరు నాటికి 1,150 మెగావాట్లుగా ఉన్న డీసీల నిర్వహణా సామర్ధ్యం 2027 మార్చి నాటికి 2,100 మెగావాట్ల వరకు పెరిగే అవకాశం ఉందని ఇక్రా అంచనా.

Updated Date - Mar 15 , 2025 | 02:04 AM