అదానీ గూటికి ఎమార్ ఇండియా!?
ABN, Publish Date - Jan 16 , 2025 | 05:39 AM
ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను నిర్మించిన ఎమార్ గ్రూప్‌నకు చెందిన భారత వ్యాపారంలో మెజారిటీ వాటా కొనుగోలుకు గౌతమ్ అదానీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం...
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను నిర్మించిన ఎమార్ గ్రూప్‌నకు చెందిన భారత వ్యాపారంలో మెజారిటీ వాటా కొనుగోలుకు గౌతమ్ అదానీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎమార్ ఇండియాలో 70-100 శాతం వరకు వాటా కొనుగోలు చేయవచ్చని.. డీల్ విలువ రూ.4,000-5,000 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గౌతమ్ అదానీ తన అన్‌లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అదానీ రియల్టీ ద్వారా ఈ కొనుగోలు జరుపనున్నారని.. ఈ డీల్‌కు అవసరమైన నిధులను కుటుంబ సంపద నుంచి సమకూర్చనున్నట్లు వారు వెల్లడించారు. అదానీ రియల్టీకి ఇదే అతిపెద్ద కొనుగోలు కానుంది.
Updated Date - Jan 16 , 2025 | 06:35 AM