Share News

Foreign Investors India: ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.31,575 కోట్లు

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:05 AM

ఏప్రిల్‌లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.31,575 కోట్లు భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. ఏడాది మొత్తం చూస్తే ఇప్పటి వరకూ ఎఫ్‌పీఐల నికర నిధుల వాపసం రూ.1.48 లక్షల కోట్లకు చేరింది

 Foreign Investors India: ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.31,575 కోట్లు

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు భారత మార్కెట్‌ నుంచి రూ.31,575 కోట్లు ఉపసంహరించారు. అంతకు ముందు మార్చి 21 నుంచి 28 తేదీల మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.30,927 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడంతో మార్చి నెలలో తరలించిన నికర నిధుల విలువ రూ.3,973 కోట్లకు తగ్గింది. ఫిబ్రవరిలో రూ.34,574 కోట్లు, జనవరిలో రూ.78,027 కోట్ల మొత్తాలను ఎఫ్‌పీఐలు తరలించుకుపోయారు. దీంతో ఏడాది మొత్తం మీద ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్న నిధుల పరిమాణం రూ.1.48 లక్షల కోట్లకు చేరింది.

Updated Date - Apr 14 , 2025 | 03:08 AM