Today Gold Rate: దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..
ABN , Publish Date - Apr 02 , 2025 | 07:26 AM
ట్రంప్ సుంకాలు వాణిజ్య యుద్ధాలకు దారి తీయనున్నాయన్న భయాందోళనలతో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోని పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి.

బిజినెస్ న్యూస్: పసిడి (Gold), వెండికి (Silver) మార్కెట్లో (Market) ఎల్లప్పుడూ డిమాండ్ (Demand) ఉంటుంది. అయితే పసిడి, వెండి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది.
Also Read..: మే నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
అంతర్జాతీయ మార్కెట్లోనూ కొత్త రికార్డు
ట్రంప్ సుంకాలు వాణిజ్య యుద్ధాలకు దారి తీయనున్నాయన్న భయాందోళనలతో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోని పెట్టుబడులను ఈ విలువైన లోహాల్లోకి మళ్లిస్తున్నారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. స్పాట్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 3,149.03 డాలర్లు, జూన్ డెలివరీ గడువుతో కూడిన కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 3,177 డాలర్ల వద్ద ఆల్‌టైం గరిష్ఠాలను నమోదు చేశాయి. సిల్వర్ మాత్రం అర శాతానికి పైగా తగ్గి 33.83 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి రూ. 8,511 కాగా 10 గ్రాముల ధర రూ. 85,110గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూపాయి పెరిగి రూ. 9,285 కాగా 10 గ్రాముల ధర రూ. 92,850గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
కోల్‌కతా- రూ.85,110, రూ.92,850
చెన్నై- రూ.85,110, రూ.92,850
బెంగళూరు- రూ.85,110, రూ.92,850
పుణె- రూ.85,110, రూ.92,850
అహ్మదాబాద్- రూ.85,160, రూ.92,900
భోపాల్- రూ.85,160, రూ.92,900
కోయంబత్తూర్- రూ.85,110, రూ.92,850
పట్నా- రూ.85,160, రూ.92,900
సూరత్- రూ.85,160, రూ.92,900
పుదుచ్చెరి- రూ.85,110, రూ.92,850
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 1,14,100గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి రూ. 100 పెరిగి.రూ.1,05,100కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండికి రూ. 100 పెరిగి.రూ.1,05,100 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,14,100గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,14,100 వద్ద కొనసాగుతోంది.
కాగా పసిడి ధరలు మంగళవారం సరికొత్త జీవిత కాల రికార్డు గరిష్ఠానికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.2,000 పెరిగి రూ.94,150కి చేరింది. దేశీయంగా మేలి మి బంగారం రూ.94,000కు చేరడం ఇదే ప్రప్రథమం. అంతేకాదు, ఈ విలువైన లోహం రేటు పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. అంతర్జాతీయంగా దీని ధరలు వేగంగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. 99.5 శాతం స్వచ్ఛత లోహం రేటు కూడా రూ.2000 పెరుగుదలతో ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.93,700కు ఎగబాకింది. దాదాపు 2 నెలల్లో గోల్డ్‌కు ఇదే అతిపెద్ద ఒక్కరోజు పెరుగుదల. ఈ ఫిబ్రవరి 10న తులం పసిడి రూ.2,400 పెరుగుదలను నమోదు చేసింది. ఈ జనవరి 1న రూ.79,390 పలికిన బంగారం.. గడిచిన మూడు నెలల్లో రూ.14,760 (18.6 శాతం) మేర పుంజుకుంది. వెండి విషయానికొస్తే, కిలో రూ.500 తగ్గుదలతో రూ.1,02,500కు పరిమితమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News