Share News

Gold Silver Rates Today: పసిడి ప్రియులకు ఊరట..కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు..

ABN , Publish Date - Apr 07 , 2025 | 06:31 AM

దేశంలో బంగారం, వెండి ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా పైపైకి వెళ్లిన వీటి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి, ఏ నగరాల్లో ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Silver Rates Today: పసిడి ప్రియులకు ఊరట..కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు..
Gold Rates today

దేశంలో బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులు పసిడిని కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ట్రంప్ నిర్ణయాలు సహా పలు అంశాల కారణంగా 92 వేల స్థాయికి చేరుకున్న 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర ప్రస్తుతం 90 వేల రూపాయల పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


నేటి ధరలు

ఈ క్రమంలో ఏప్రిల్ 7, 2025న గుడ్ రిటర్న్స్ వెబ్‎సైట్ ప్రకారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 90,650గా ఉండగా..22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 83,090గా కలదు. ఈ ధరలు గత రేట్లతో పోలిస్తే 100 రూపాయలు తగ్గడం విశేషం. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 90,800కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 83,240 స్థాయిలో ఉంది. మరోవైపు దేశంలో వెండి ధరలు కిలోకు వెయ్యి రూపాయలు తగ్గి రూ. 93,900గా ఉన్నాయి.


దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధలు ఎలా ఉన్నాయంటే (24, 22 క్యారెట్)

  • ముంబైలో రూ.90,650, రూ.83,090

  • జైపూర్‎లో రూ.90,800, రూ.83,240

  • కోల్‌కతాలో రూ.90,650, రూ.83,090

  • అహ్మదాబాద్‎లో రూ.90,700, రూ.83,140

  • చెన్నైలో రూ.90,650, రూ.83,090

  • బెంగళూరులో రూ.90,650, రూ.83,090

  • న్యూఢిల్లీలో రూ.90,800, రూ. 83,240

  • విశాఖపట్నంలో రూ.90,650, రూ.83,090


బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తిస్తారు..

ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల పన్నులు, తయారీ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పసిడి ధరలు వేర్వేరుగా ఉంటాయి. ఆభరణాల తయారీకి ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా వినియోగిస్తారు. పసిడి స్వచ్ఛతను క్యారెట్ల ఆధారంగా గుర్తిస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 07 , 2025 | 06:42 AM