Gold and Silver Rates Today: షాకింగ్.. వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN, Publish Date - Jan 03 , 2025 | 06:27 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఓసారి ఈ ధరలను తెలుసుకుని వెళ్లండి మరి. గత వారం రేట్లను అంచనా వేసుకుని వెళ్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రేట్లు మళ్లీ పెరిగాయి. అయితే తాజాగా ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం(gold), వెండి (silver) ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే కొత్త సంవత్సరం బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. కొత్త ఏడాది మూడో రోజు బంగారం ధర రూ. 330 పెరిగింది. శుక్రవారం జనవరి 3, 2025న ఉదయం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగింది. దీంతో దేశంలోని చాలా నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,400కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,900గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు కిలో వెండి 90,400కు చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం ధరలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ గోల్డ్ రేట్, 24 క్యారెట్ గోల్డ్ రేట్ (రూపాయల్లో)
ఢిల్లీ 71,950 78,480
ముంబై 71,800 78,330
కోల్‌కతా 71,800 78,330
హైదరాబాద్‌లో 71,810 78,340
విజయవాడలో 71,810 78,340
నోయిడా 71,950 78,480
ఘజియాబాద్ 71,950 78,480
జైపూర్ 71,950 78,480
గుర్గావ్ 71,950 78,480
లక్నో 71,950 78,480
పాట్నా 71,850 78,380
అహ్మదాబాద్ 71,850 78,380
భువనేశ్వర్ 71,800 78,330
బెంగళూరు 71,800 78,330
బంగారం ఎందుకు పెరిగింది?
అంతర్జాతీయ మార్కెట్‌లో విలువైన లోహాల ధరలు పెరగడం, దేశీయ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరగడంతో ఈ పెంపు జరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రూపాయి బలహీనత, అంతర్జాతీయ మార్కెట్‌లో బలపడటం బంగారం ధరలకు మద్దతునిచ్చాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కామెక్స్ మార్కెట్‌లో కూడా బంగారం ఔన్సు $ 2,640 పైన ట్రేడవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో బంగారం ధర మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
22, 24 క్యారెట్ల మధ్య తేడా మీకు తెలుసా?
బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను 22 క్యారెట్ల బంగారంలో 9% కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం విలాసవంతమైనది అయినప్పటికీ, దీనిని ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించుకోలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారం విక్రయిస్తారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే ముందు మళ్లీ రేట్లు తెలుసుకోవాలని సూచన. వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలు కలిగి ఉండవు.
ఇవి కూడా చదవండి:
రిలయన్స్ జియో రూ.40,000 కోట్ల ఐపీఓ!
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 03 , 2025 | 07:48 AM