రికార్డు గరిష్ఠానికి బంగారం రూ.89,450కి పెరిగిన 10 గ్రాముల ధర
ABN, Publish Date - Mar 14 , 2025 | 04:08 AM
దేశీయంగా పసిడి ధర గత రికార్డు గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరుగుదలతో...

న్యూఢిల్లీ: దేశీయంగా పసిడి ధర గత రికార్డు గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరుగుదలతో రూ.89,450కి చేరుకుంది. గత నెల 20న మేలిమి బంగారం ఇదే ధర పలికింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం విషయానికొస్తే, రూ.600 పెరిగి రూ.89,050కి ఎగబాకింది. ఇక కిలో వెండి మరో రూ.1,000 మేర ప్రియమై దాదాపు ఐదు నెలల నాటి గరిష్ఠ స్థాయి రూ.1,01,200కు చేరింది.
Updated Date - Mar 14 , 2025 | 04:09 AM