Share News

Gold Prices: గుడ్ న్యూస్, 5 రోజుల పెరుగుదలకు బ్రేక్..భారీగా తగ్గిన గోల్డ్ ధర..

ABN , Publish Date - Apr 04 , 2025 | 07:19 PM

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చింది. బులియన్ మార్కెట్‌లో గత ఐదు రోజులుగా పెరిగిన ధరలు ఈరోజు (ఏప్రిల్ 4న) తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 Gold Prices: గుడ్ న్యూస్, 5 రోజుల పెరుగుదలకు బ్రేక్..భారీగా తగ్గిన గోల్డ్ ధర..
Gold Prices Drop

పసిడి ప్రియులకు అదిరి పోయే వార్త వచ్చేసింది. భారత బులియన్ మార్కెట్‌లో గత ఐదు రోజులుగా భారీగా పెరిగిన ధరలకు శుక్రవారం (ఏప్రిల్ 4న) బ్రేక్ పడింది. ఈ క్రమంలో శుక్రవారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,350 తగ్గి రూ.93,000కి చేరుకున్నాయి. ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు గురువారం (ఏప్రిల్ 3) 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.94,350కి చేరుకుంది.


వెండి ధరలు కూడా పడిపోవడం

గోల్డ్ ధరల తగ్గుదలతో పాటు, వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. వెండి ధర కిలోకు రూ.5,000 తగ్గి రూ.95,500కి చేరుకుంది. ఇది గత 4 నెలల్లో జరిగే అతిపెద్ద పతనంగా భావించవచ్చు. గత ట్రేడింగ్ సెషన్‌లో, వెండి ధర రూ.1,00,500 వద్ద ముగిసింది.


కారణమిదేనా..

ఇది ప్రధానంగా గ్లోబల్ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితుల కారణంగా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు అమెరికా దిగుమతులపై చైనా 34 శాతం సుంకాలు విధిస్తామని చెప్పడం కూడా ఓ కారణమని అంటున్నారు. మరోవైపు మారిన ప్రజల ఆర్థిక మార్పులు, వృద్ధి అవకాశాలపై మారిన ధోరణుల వల్ల ట్రేడింగ్ సెంటిమెంట్ బలహీనంగా మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ పడిపోయినప్పుడు మంచి లాభాలు రావచ్చని, కానీ, భవిష్యత్తులో మరింత పెరుగుదల కంటే, రేట్లు పడిపోయినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు.


అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణ

గ్లోబల్ ఫ్రంట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు US $21.74 లేదా 0.70 శాతం తగ్గి US $3,093.60కి చేరుకుంది. ఈ మార్పు ట్రేడర్లను ఒక రకమైన అనిశ్చితి, జాగ్రత్తలను సూచిస్తుంది. అలాగే ఆసియా మార్కెట్లలో వెండి ధర కూడా 1.69 శాతం పడిపోయి 31.32 డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో గోల్డ్, వెండి, ఇతర విలువైన లోహాల ధరలను మార్కెట్ సెంటిమెంట్లతో పాటు జాగ్రత్తగా పరిశీలించాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పతనాలు లేదా ప్రతికూల పరిస్థితులు వస్తే, బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ డాలర్ బలహీనపడటం వంటి అంశాల కారణంగా పసిడి ధరలు తగ్గుముఖం పడతాయి.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 04 , 2025 | 07:35 PM