ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌ బంగారు కొండ!

ABN, Publish Date - Jan 12 , 2025 | 01:40 AM

భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువే. భారత కుటుంబాల వద్ద ఆభరణాలు, ఇతర రూపాల్లో 22,000 టన్నులకు పైగా బంగారం ఉండవచ్చని అంచనా. స్వర్ణాభరణాలు, నాణేలు, కడ్డీల తయారీ కోసం గడిచిన 26 ఏళ్లలో మన దేశం...

మనోళ్ల దగ్గర 22,000 టన్నుల పసిడి నిల్వలు

గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చండి..

ప్రభుత్వానికి బులియన్‌ వర్తక సంఘాల వినతి

భారతీయులకు బంగారంపై మోజు ఎక్కువే. భారత కుటుంబాల వద్ద ఆభరణాలు, ఇతర రూపాల్లో 22,000 టన్నులకు పైగా బంగారం ఉండవచ్చని అంచనా. స్వర్ణాభరణాలు, నాణేలు, కడ్డీల తయారీ కోసం గడిచిన 26 ఏళ్లలో మన దేశం దిగుమతి చేసుకున్న బంగారానికి సమానమిది.పసిడి దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు దేశీయ కుటుంబాల వద్ద నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని పునర్వినియోగంలోకి తెచ్చేందుకు ఈసారి బడ్జెట్‌లో గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాన్ని (జీఎంఎస్‌) మరింత ఆకర్షణీయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి బులియన్‌ వర్తక సంఘాలు లేఖ రాశాయి. ఇందుకోసం గోల్డ్‌ డిపాజిట్ల కాలపరిమితిపై మరింత వెసులుబాటుతో పాటు అధిక వడ్డీని ఆఫర్‌ చేయడం సహా 500 గ్రాముల వరకు బంగారం డిపాజిట్‌పై ఎలాంటి పన్ను దర్యాప్తు ఉండదన్న హామీ ఇవ్వాలని వర్తక సంఘాలు సూచించాయి. అలాగే, దీర్ఘకాలిక జీఎంఎస్‌ డిపాజిట్లపై పసిడి రుణాలందించేందుకు బ్యాంకులకు అనుమతివ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రముఖ, గుర్తింపు కలిగిన జువెలర్లు సైతం జీఎంఎ్‌సలో పాల్గొనేందుకు వీలుగా పథకంలో మార్పులు చేయాలన్నారు. ఆభరణ విక్రయ కంపెనీలైతే నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని నగదీకరించుకునెలా కస్టమర్లకు నచ్చజెప్పగలవన్నారు.


ఏటా 800-850 టన్నుల దిగుమతులు

ఏటా దేశంలోకి 800-850 టన్నుల వరకు బంగారం దిగుమతి అవుతోంది. విలువపరంగా చూస్తే, 2023లో భారత్‌ 4,260 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. 2024 నవంబరుతో ముగిసిన 11 నెలల్లోనే 4,700 కోట్ల పసిడి దేశంలోకి దిగుమతైంది. గత ఏడాదిలో పసిడి ధరలు భారీగా పెరగడం ఇందుకు కారణమైంది. విదేశాల నుంచి పసిడి ప్రవాహం పెరిగితే దిగుమతుల వ్యయం కూడా పెరిగి కరెంట్‌ ఖాతా లోటు నియంత్రణ లక్ష్యాలను మించిపోయే ప్రమాదం ఉంది. కాగా ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.80,550కి చేరింది.


జీఎంఎస్‌ గురించి..

కుటుంబాలు, సంస్థలు, దేవాలయాల వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 నవంబరు 5న గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ (జీఎంఎస్‌)ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కస్టమర్లు ముడి బంగారం (నాణేలు, కడ్డీలు, రాళ్లు లేదా ఇతరాలు లేని ఆభరణాలు) బ్యాంకుల వద్ద డిపాజిట్‌ చేయవచ్చు. కనీసం 10 గ్రాములు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి లేదు. ఈ స్కీమ్‌ మూడు కాలపరిమితుల (స్వల్ప, మఽధ్య, దీర్ఘకాలిక)తో కూడిన డిపాజిట్లను ఆఫర్‌ చేస్తోంది. మధ్యకాలిక (5-7 ఏళ్లు) డిపాజిట్‌పై 2.25 శాతం, దీర్ఘకాలిక (12-15 ఏళ్లు) డిపాజిట్‌పై 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. కాగా, స్వల్పకాలిక (1-3 ఏళ్ల) డిపాజిట్‌పై వడ్డీని నిర్ణయించేందుకు సంబంధిత బ్యాంకుకే అధికారం కల్పించారు. అయితే, విధానపరమైన సమస్యలతోపాటు నమ్మకం లోపించడం కారణంగా కస్టమర్ల నుంచి ఈ పథకానికి ఆశించిన స్పందన లభించలేదు. 2024 మార్చి నాటికి జీఎంఎస్‌ పథకం కింద కేవలం 30.15 టన్నుల బంగారం మాత్రమే డిపాజిట్‌ అయింది.

Updated Date - Jan 12 , 2025 | 01:40 AM