Repo Rate: రెపో రేటు మరో 0.75 శాతం తగ్గింపు!
ABN, Publish Date - Mar 15 , 2025 | 02:17 AM
దేశంలో వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయి. ప్రస్తుతం 6.25 శాతంగా ఉన్న రెపో రేటును.. ఈ ఏడాది అక్టోబరులోగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ).
ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా
ముంబై: దేశంలో వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయి. ప్రస్తుతం 6.25 శాతంగా ఉన్న రెపో రేటును.. ఈ ఏడాది అక్టోబరులోగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ).. ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ముప్పావు శాతం (0.75 శాతం) వరకు తగ్గించే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ వెల్లడించింది. ఏప్రిల్, జూన్, అక్టోబరు నెలల్లో జరిగే ద్వైమాసిక పరపతి, ద్రవ్య విధాన సమీక్షల్లో పావు శాతం (0.25 శాతం) చొప్పున ఎంపీసీ ఈ తగ్గింపు ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంది. దిగొస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణమే ఇందుకు కారణమని తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) మొత్తానికి 4.7 శాతంగా ఉండే రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో 4.2 శాతం మించకపోవచ్చని అంచనా వేసింది. ఫిబ్రవరిలో 3.6 శాతానికి పడిపోయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం మొత్తానికి చూసినా 3.9 శాతం మించకపోవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ తెలిపింది. దీంతో వచ్చే ఏప్రిల్ నుంచే ఆర్‌బీఐ రెపో రేటు కోతకు సిద్ధమవుతుందని భావిస్తున్నారు.
Updated Date - Mar 15 , 2025 | 02:18 AM