Share News

Gold Consumption: బంగారు బ్రతుకులు

ABN , Publish Date - Apr 12 , 2025 | 08:35 PM

పసుపులోహం యేఏడాదికాఏడాది తన సరిగమల్ని పలికిస్తోంది. సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు ఏకకాలంలో తెచ్చే ఆర్థిక ప్రయోజనాలే వినియోగదారులు అంతగా పరిగణలోకి తీసుకోవడానికి కారణమంటున్నారు.

Gold Consumption: బంగారు బ్రతుకులు
Gold Consumption

Gold Consumption: భారతదేశంలో బంగారంపై మోజు రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికి కారణం పుత్తడిని కేవలం అలంకార ఆభరణాల కోసమే కాకుండా ప్రజలు దీన్నొక పెట్టుబడి మార్గంగా కూడా చూడ్డం బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఎగబాకడానికి కారణమవుతోంది. ప్రజలే కాదు, అటు బ్యాంకులు కూడా బంగారంపై భారీగానే మోజు పెంచుకుంటున్నాయి. భారీ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నాయి. బంగారం ధరలు ప్రతీ ఏడాది పెరుగుతూ పోతుండటంతో ఈ పసుపు లోహాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా కూడా అంతా చూస్తున్నారు.

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నందున బంగారం వ్యాపారం చేసే జ్యువెలరీ సంస్థలకు మాత్రం తలనొప్పిగా మారుతోందట. మార్జిన్లను మెయిన్ టైన్ చేయడం సవాలులా తయారైందంటున్నారు. మరోవైపు, ఆభరణాల కంటే జనం బంగారం బిస్కట్లు, నాణేలు వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటం సదరు సంస్థలకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే, ఆభరణాల అమ్మకాల్లో తరుగు చార్జీల ద్వారా తగినంత లాభం పొందేందుకు వ్యాపార సంస్థలకు వీలుంటుంది. అదే గోల్డ్ బిస్కెట్స్ వంటి అమ్మకాల్లో లాభం చాలా పరిమితంగా ఉంటుంది.

'పిఎన్‌ గాడ్గిల్' క్యూ 3 అంచనాల ప్రకారం భారతదేశంలో బంగారం వినియోగ విధానాలు గణనీయంగా మారనున్నాయని చెబుతున్నారు. మొత్తం బంగారం అమ్మకాలలో బంగారు కడ్డీలు, నాణేల వాటా ఐదేళ్లలో 34 శాతం నుండి 38 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు ఏకకాలంలో దాని ఆర్థిక ప్రయోజనాలను వినియోగదారులు పరిగణలోకి తీసుకోవడమే దీనికి కారణమంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..

Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..

Inter Sudent Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Updated Date - Apr 12 , 2025 | 09:38 PM