Trading : మద్దతు స్థాయిలు 23,250, 23,000
ABN, Publish Date - Jan 13 , 2025 | 02:45 AM
నిఫ్టీ గత వారం కీలక స్థాయి 24,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై వారం అంతా డౌన్‌ట్రెండ్‌లోనే ట్రేడవుతూ 570 పాయింట్ల నష్టంతో 23,430 వద్ద ముగిసింది.
నిఫ్టీ గత వారం కీలక స్థాయి 24,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై వారం అంతా డౌన్‌ట్రెండ్‌లోనే ట్రేడవుతూ 570 పాయింట్ల నష్టంతో 23,430 వద్ద ముగిసింది. ప్రధాన మద్దతు స్థాయి 23,500 వద్ద రెండు నెలల పాటు సుదీర్ఘ కన్సాలిడేషన్ అనంతరం ఆ స్థాయిలో నిలదొక్కుకోవడంలో విఫలమైంది. అంతకన్నా దిగువనే క్లోజ్ కావడం మరింత అప్రమత్తతను సూచిస్తోంది. గత మూడు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లోనే ఉన్న మార్కెట్ ఇటీవలి గరిష్ఠ స్థాయిల నువచా 3,000 పాయింట్ల వరకు నష్టపోయింది. ఇక గత వారం మిడ్‌క్యాప్-100 సూచీ 3,350 పాయింట్లు, స్మాల్‌క్యాప్-100 సూచీ 1,400 పాయింట్లు నష్టపోయాయి. గత శుక్రవారం అమెరికన్ మార్కెట్లో భారీ పతనం కారణంగా ఈ వారంలో మార్కెట్ మరింత బలహీనత ప్రదర్శించవచ్చు. సోమవారం ఏర్పడవచ్చనుకుంటున్న ఇంట్రాడే రియాక్షన్ అనంతరం మార్కెట్ పునరుజ్జీవం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ ప్రధాన మద్దతు స్థాయి 23,250 (గతంలో ఏర్పడిన మేజర్ బాటమ్) చేరువకు వస్తోంది. సానుకూలత కోసం మార్కెట్ ఇక్కడ నిలదొక్కుకోవాలి. రికవరీ బాట పట్టినట్టయితే స్వల్పకాలిక సానుకూలత కోసం ప్రధాన నిరోధం 23,500 కన్నా పైన నిలదొక్కుకోవాలి.
బేరిష్ స్థాయిలు: మరింత బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం మద్దతు స్థాయి 23,250 వద్ద పునరుజ్జీవం సాధించాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 23,000 వద్ద కన్సాలిడేట్ కావచ్చు. ఇక్కడ కూడా విఫలమైతే మరింత అప్రమత్తత తప్పదు.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ అంతకు ముందు వారంతో పోల్చితే 2,250 పాయింట్లు నష్టపోయి 48,730 వద్ద ముగిసింది. గత మూడు నెలల కాలంలో కీలక స్థాయి 50,000 వద్ద ఎన్నో సార్లు రికవరీకి సాధించిన సూచీ చివరికి అంతకన్నా దిగువకు పడిపోయింది. రికవరీ బాట పడితే సానుకూలత కోసం ప్రధాన నిరోధం 49,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతు స్థాయి, మానసిక అవధి 48,000.
పాటర్న్: నిఫ్టీ గత వారం 200 డిఎంఏ వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైంది. ఇది మరింత అప్రమత్త సంకేతం. ప్రస్తుతం 23,250 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద గట్టి మద్దతు ఉంది. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. మార్కెట్ ఇప్పుడు 50 డిఎంఏ వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి.
టైమ్:ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం: 23,440, 23,500
మద్దతు : 23,300, 23,250
Updated Date - Jan 13 , 2025 | 02:45 AM