ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విదేశీ మార్కెట్లపై మహీంద్రా ఫోకస్‌

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:49 AM

దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహీంద్రా అండ్‌ మహీంద్రా అంతర్జాతీయ మార్కె ట్ల విస్తరణ వైపు దృష్టి సారించింది. దశలవారీగా అంతర్జాతీయ మార్కెట్లలో ఆటోమోటివ్‌ వ్యాపారాన్ని విస్తరించాలని....

ఇప్పటికే బలం ఉన్న చోట్ల కొత్త వాహనాల విడుదల

పూణె: దేశీయ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహీంద్రా అండ్‌ మహీంద్రా అంతర్జాతీయ మార్కె ట్ల విస్తరణ వైపు దృష్టి సారించింది. దశలవారీగా అంతర్జాతీయ మార్కెట్లలో ఆటోమోటివ్‌ వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓ రాజేష్‌ జెజూరికర్‌ తెలిపారు. విదేశీ మార్కెట్లకు విస్తరించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం ఉన్న పంపిణీ చానళ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న లైఫ్‌స్టైల్‌ పికప్‌ ట్రక్‌, కొత్తగా తయారుచేయనున్న విద్యుత్‌ వాహనాలు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లలో ప్రవేశించేందుకు సహాయపడతాయని భావిస్తున్నట్టు తెలిపారు. కంపెనీకి ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, చిలీ, మొరాకో బలమైన మార్కెట్లుగా ఉన్నాయి. ఈ మార్కెట్లన్నింటిలోనూ స్కార్పియో పిక్‌పకు మంచి ఆదరణ ఉన్నదంటూ ఎక్స్‌యూవీ 700, స్కార్పియో ఎన్‌, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వాహనాలను ప్రవేశపెట్టాలనుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. తయారీ దశలో ఉన్న లైఫ్‌స్టైల్‌ పికప్‌ వాహనం రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌, లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ మార్కెట్లన్నింటి అవసరాలు తీర్చుతుందని జెజూరికర్‌ తెలిపారు. ప్రధానంగా పికప్‌ వాహనాలకు ఆసియాన్‌ మంచి మార్కెట్‌ అని, అక్కడకు తాము ఇంకా విస్తరించలేదని ఆయన అన్నారు. 2023 సంవత్సరంలో మహీంద్రా కంపెనీ ‘‘గ్లోబల్‌ పికప్‌’’ కాన్సెప్ట్‌ కారును ఆవిష్కరించింది.


2027 నాటికి అది ఉత్పత్తి దశను చేరుతుందని ఆయన చెప్పారు. ప్రపంచ మార్కెట్ల విస్తరణలో మూడో దశగా రైట్‌హ్యాండ్‌ డ్రైవ్‌ విద్యుత్‌ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. రైట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ మార్కెట్లలో స్థిరపడిన అనంతరం లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ మార్కెట్లలోకి ప్రవేశించాలనుకుంటున్నట్టు చెప్పారు. ఐసీఈ (ఇంటర్నల్‌ కంబుస్టన్‌ ఇంజన్‌) పోర్ట్‌ఫోలియోలో మరింత బలపడేందుకు 2025 సంవత్సరంలో ప్రయత్నిస్తామని జెజూరికర్‌ తెలిపారు. రాక్స్‌ మోడల్‌కు ఈ మార్కెట ్లలో మంచి ఆదరణ ఉన్నదని, ఉత్పత్తి సామర్థ్యాలను మరిం త పెంచవలసి ఉన్నదని చెప్పారు. అలాగే 3 ఎక్స్‌ఓ సామర్థ్యాలు కూడా పెంచుకోవలసి ఉన్నదన్నారు. 2025 సంవత్సర ప్రాధాన్యతల్లో విద్యుత్‌ వాహనాలు కీలకమని ఆయన తెలిపారు. గత నవంబరులో తాము ఆవిష్కరించిన బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఇ విద్యుత్‌ కార్ల డెలివరీ మార్చి నాటికి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

బుధవారం కంపెనీ చకాన్‌ ప్లాంట్‌లో ఈవీ తయారీ, బ్యాటరీ తయారీ యూనిట్లను ప్రారంభించింది. ఏడాదికి 90 వేల విద్యుత్‌ కార్ల తయారీ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఏడాదికి 1.2 లక్షల వరకు తయారీ సామర్థ్యం పెంచుకోగల వసతి ఈ ప్లాంట్‌లో ఉంది. 2022-27 సంవత్సరాల మధ్య కాలంలో విద్యుత్‌ వాహనాలపై రూ.16,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.

Updated Date - Jan 09 , 2025 | 01:49 AM