Stock Market Predictions: నిరోధ స్థాయి 23,000
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:51 AM
నిఫ్టీ 23,000 పాయింట్ల వద్ద నిరోధానికి గురవుతుండగా, మార్కెట్ స్వల్పకాలిక కన్సాలిడేషన్ దశలోకి ప్రవేశించే అవకాశముంది. బుల్లిష్ ట్రెండ్ కొనసాగాలంటే 23,000 పై స్థాయిలో బలమైన క్లోజ్ అవసరం

టెక్ వ్యూ
సోమవారం స్థాయిలు
నిరోధం : 22,930, 23,000
మద్దతు : 22,780, 22,700
నిఫ్టీ గత వారం కనిష్ఠ స్థాయిల నుంచి బలమైన రికవరీ సాధించి వారం గరిష్ఠ స్థాయి 22,800 సమీపంలో ఆ స్థాయి కన్నా పైన క్లోజయింది. ఈ రికవరీతో తక్షణ ముప్పును కూడా తప్పించుకుంది. కాని ఈ బలమైన రికవరీ ప్రభావం వల్ల వచ్చే వారంలో పుల్‌బ్యాక్ రియాక్షన్ ఏర్పడవచ్చు. అంతే కాదు,గత వారంలో మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు, భారీ ఎగుడుదిగుడులక గురయినందు వల్ల ఈ వారంలో నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఇప్పుడు పాజిటివ్ ట్రెండ్‌కు ఆస్కారం ఉన్నప్పటికీ కీలక స్థాయి 23,000 వద్ద కొంత నిరోధం ఎదురుకావచ్చు. ఈ వారంలో మూడే ట్రేడింగ్ దినాలున్నందు వల్ల కన్సాలిడేషన్‌కు కూడా ఆస్కారం ఉంది. 23,000 వద్ద నిఫ్టీ పరీక్షకు గురి కావచ్చు.
బుల్లిష్ స్థాయిలు: మరింత పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడయినట్టయితే 23,000 వద్ద స్వల్పకాలిక కన్సాలిడేషన్ ఏర్పడవచ్చు. 1,250 పాయింట్ల ర్యాలీ అనంతరం స్వల్పకాలిక లక్ష్యాన్ని కూడా చేరింది. మరింత స్వల్పకాలిక సానుకూలత కోసం ఈ నిరోధం కన్నా పైన పటిష్ఠంగా క్లోజ్ కావాలి.
బేరిష్ స్థాయిలు: 23,000 వద్ద విఫలమైతే అప్రమత్త సంకేతం ఇస్తుంది. మైనర్ మద్దతు స్థాయి 22,700 వద్ద విఫలమైతే మైనర్ బలహీనత ఏర్పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 22,500. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ కూడా మంచి ర్యాలీ సాధించినా 500 పాయింట్ల నష్టంతో 51,000 సమీపంలో క్లోజయింది. ఇక్కడ పరీక్ష ఎదుర్కొనవచ్చు. నిరోధ స్థాయిలు 51,600, 52,000. మైనర్ మద్దతు స్థాయి 50,600 వద్ద విఫలమైతే మైనర్ బలహీనతకు ఆస్కారం ఉంటుంది.
పాటర్న్: మార్కెట్ ప్రస్తుతం 23,000 సమీపంలో 25, 50 డిఎంఏల వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి. ఇదే స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద బ్రేకౌట్ సాధిస్తే మరింత స్వల్పకాలిక సానుకూల సంకేతం ఇస్తుంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం గత వారంలో బాటమ్ ఏర్పడింది. సాధారణ పరిస్థితుల్లో తక్షణ డౌన్‌ట్రెండ్ ముప్పు ఉండకపోవచ్చు.