Stock Market Bullish Trend: 23,200 పైన బుల్లిష్
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:38 AM
గత వారం నిఫ్టీ స్వల్ప నష్టంతో 22,829 వద్ద ముగిసింది. ఈ వారం 23,200 పాయింట్లకు పైగా ముగిస్తే మార్కెట్ బుల్లిష్‌గా మారే అవకాశముంది

(ఏప్రిల్ 15-17 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 22,829 (-76) నిఫ్టీ గత వారం 21,744-22,924 పాయింట్ల మధ్యన కదలాడి 76 పాయింట్ల నష్టంతో 22,829 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,200 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 22,594, 22,763, 23,138, 22,806 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 23,200
బ్రేక్‌డౌన్ స్థాయి: 22,425
నిరోధ స్థాయిలు: 23,025, 23,125, 23,225
(22,925 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 22,625, 22,525, 22,425
(22,725 దిగువన బేరిష్)