Share News

ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:17 AM

మరోసారి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 1 నుంచి ‘ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ విధానం...

ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ

మే 1 నుంచే అమల్లోకి

న్యూఢిల్లీ: మరోసారి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 1 నుంచి ‘ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ విధానం అమల్లోకి రానుంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 43 ఆర్‌ఆర్‌బీలను 28కి కుదిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌,ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, బిహార్‌, కర్ణాటక, జమ్మూకాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిసా, రాజస్థాన్‌ల్లోని పలు ఆర్‌ఆర్‌బీలను ఒకే ఆర్‌ఆర్‌బీగా విలీనం చేస్తున్నట్టు తెలిపింది. ఆర్‌ఆర్‌బీలు ఖర్చులు తగ్గించుకుని నిర్వహణ సామర్ధ్యం పెంచుకునేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌బీలను పునర్‌ వ్యవస్థీకరించడం ఇది నాలుగోసారి.

Updated Date - Apr 09 , 2025 | 05:31 AM