ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీలోకి పెన్నార్‌

ABN, Publish Date - Jan 02 , 2025 | 05:49 AM

స్థానిక పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన జెట్‌వర్క్‌ మాన్యుఫాక్చరింగ్‌ బిజినెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జడ్‌ఎంబీపీఎల్‌) కంపెనీతో కలిసి...

హైదరాబాద్‌: స్థానిక పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం బెంగళూరుకు చెందిన జెట్‌వర్క్‌ మాన్యుఫాక్చరింగ్‌ బిజినెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జడ్‌ఎంబీపీఎల్‌) కంపెనీతో కలిసి ఒక జాయింట్‌ వెంచర్‌ (జేవీ) ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి జడ్‌ఎంబీపీఎల్‌ కంపెనీతో బుధవారం ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఈ జేవీ ఈక్విటీలో జడ్‌ఎంబీపీఎల్‌ కంపెనీకి 50.1 శాతం, పెన్నార్‌ ఇండస్ట్రీ్‌సకు 45 శాతం, ఇతరులకు 4.9 శాతం వాటా ఉంటుంది. తన 45 శాతం వాటా కోసం కంపెనీ ఈ జేవీకి రూ.18.75 కోట్లు సమకూర్చనుంది. ఈ జేవీ ద్వారా దేశ, అంతర్జాతీయ మార్కెట్లకు అవసరమైన సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ, అమ్మకం కోసం ప్రత్యేక ప్లాంటు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ జేవీ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేసేదీ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించలేదు. ఈ వార్తలతో బుధవారం కంపెనీ షేర్లు బీఎ్‌సఈలో 5.09 శాతం లాభంతో రూ.203.40 వద్ద ముగిశాయి.

Updated Date - Jan 02 , 2025 | 05:49 AM