Employees Strike: 24-25 తేదీల్లో బ్యాంకింగ్‌ ఉద్యోగుల సమ్మె

ABN, Publish Date - Mar 15 , 2025 | 02:12 AM

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ కీలక డిమాండ్ల సాధన కోసం ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌..

Employees Strike: 24-25 తేదీల్లో  బ్యాంకింగ్‌ ఉద్యోగుల సమ్మె

కోల్‌కతా: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ కీలక డిమాండ్ల సాధన కోసం ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)తో జరిగిన చర్చలు విఫలమవడంతో గతంలో నిర్ణయించిన విధంగా ఈ నెల 24-25 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్టు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ (యూఎ్‌ఫబీయూ) ప్రకటించింది. పీఎ్‌సబీల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీ, వారానికి ఐదు రోజుల పని విధానంతో సహా ఏ అంశంపైనా ఐబీఏ దిగి రాలేదని బ్యాంకింగ్‌ ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్‌సీబీఈ) ప్రధాన కార్యదర్శి ఎల్‌ చంద్రశేఖర్‌ చెప్పారు.


పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం (డీఎ్‌ఫఎస్‌) జారీ చేసిన ఆదేశాలనూ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది తమ ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తుందని పేర్కొన్నాయి.

Updated Date - Mar 15 , 2025 | 02:12 AM