Share News

మరో పావు శాతం వడ్డీ కోత

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:13 AM

ఆర్‌బీఐ తన రెపో రేటును మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందని అర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గడంతో పాటు...

మరో పావు శాతం వడ్డీ కోత

నేటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం

ముంబై: కీలక రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మరో పావు శాతం తగ్గించే అవకాశాలు కనిపి స్తున్నాయి. ద్రవ్యోల్బణం 4ు కన్నా దిగిరావడమే ఇందుకు కారణం. దీనికి తోడు అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో వృద్ధిని ఉద్దీపింప చేయాల్సిన అవసరం సైతం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమవుతున్న ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) బుధవారం ప్రకటించనున్న నూతన ఆర్థిక సంవత్సరపు తొలి పాలసీలో రెపో రేటును మరో పావు శాతం తగ్గించే ఆస్కారం ఉందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఫిబ్రవరి పాలసీలో 0.25 శాతం తగ్గింపుతో ప్రస్తుతం రెపో రేటు 6.25 శాతం వద్ద ఉంది. ఈసారి మరో పావు శాతం తగ్గించినట్టయితే 6 శాతానికి దిగొస్తుంది. ఫలితంగా గృహ, వినియోగ, పారిశ్రామిక రుణాలపై వడ్డీ రేట్లు మరింతగా తగ్గి అన్ని వర్గాలకు ఊరట లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

BSNL: పుంజుకున్న బీఎస్ఎన్ఎల్, కొత్తగా 55 లక్షల మంది కస్టమర్లు..మొత్తం ఎంతంటే..

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:13 AM