ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RBI : వ్యక్తిగత రుణాలకుస్థిర వడ్డీ రేట్లు తప్పనిసరి

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:17 AM

నెలవారీ వాయిదాల (ఈఎంఐ) పద్దతిలో చెల్లించే వ్యక్తిగత రుణాలను బ్యాంకులు తప్పనిసరిగా స్థిర వడ్డీ రేట్లకూ మంజూరు చేయాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది.

ముంబై: నెలవారీ వాయిదాల (ఈఎంఐ) పద్దతిలో చెల్లించే వ్యక్తిగత రుణాలను బ్యాంకులు తప్పనిసరిగా స్థిర వడ్డీ రేట్లకూ మంజూరు చేయాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. దీనికి సంబంఽధించి శుక్రవారం తరచుగా అడిగే కొన్ని ప్రశ్నల (ఎఫ్‌ఏక్యూ)ను విడుదల చేసింది. అన్ని రకాల వ్యక్తిగత రుణాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ రుణాలు మంజూరు చేసేటప్పుడే వార్షిక వడ్డీ రేటును బ్యాంకులు తమ కీ ఫ్యాక్ట్‌ స్టేట్‌మెంట్‌ (కేఎ్‌ఫఎస్‌), రుణ ఒప్పందంలో తెలియజేయాలని కోరింది. ఏ కారణం చేతనైనా రుణ చెల్లింపు సమయంలో ఈఎంఐ లేదా కాలపరిమితి మారితే ఆ విషయాన్ని కూడా బ్యాంకులు రుణ గ్రహీతలకు తెలియజేయాలని స్పష్టం చేసింది. ప్రతి మూడు నెలలకు జారీ చేసే స్టేట్‌మెంట్స్‌లోనూ బ్యాంకులు అప్పటి వరకు వసూలు చేసిన అసలు, వడ్డీ వివరాలు, ఈఎంఐ మొత్తం, ఇంకా ఎన్ని ఈఎంఐలు చెల్లించాలి? ఇంకా చెల్లించాల్సిన అసలుపై చెల్లించవలసిన వడ్డీ రేటు కూడా తెలియజేయాలని కోరింది. వడ్డీ రేట్లను సవరించేటప్పుడు బ్యాంకుల వ్యక్తిగత రుణ గ్రహీతలకు తమ బోర్డు ఆమోదించిన విధానానికి అనుగుణంగా స్థిర వడ్డీ రేటుకు మారే అవకాశాన్ని తప్పనిసరిగా కల్పించాలని కూడా ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Updated Date - Jan 11 , 2025 | 04:17 AM